


వంటలను పరిశీలిస్తున్న మునిసిపల్ చైర్ పర్సన్,కమీషనర్, Amc చైర్ పర్స్సన్, కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు.



“నేటి భారతం”(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
Dec 01, 2024.
Lpg వినియోగం పై అవగాహన కలిగి ఉండాలని, Lpg గ్యాస్ వినియోగం లో
5సూత్రాలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చని LPG సేల్స్ చీఫ్ మేనేజర్ p. V లలిత తెలిపారు. ఆదివారం సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో Lpg వినియోగం పై అవగాహన కొరకు “మన వంటగది మన భాద్యత ” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వంటల పోటీలు నిర్వహించారు. అనంతరం పోటిల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.అనంతరం చీఫ్ మేనేజర్ లలిత మాట్లాడుతూ,గృహిణిలు సిలిండర్ తీసుకునేటప్పుడు దానిని తనిఖీ చేయాలన్నారు. పొయ్యిని సిలిండర్ కంటే ఎత్తులో ఉండేలా చూసుకోవాలన్నారు.రెగ్యులటర్ ఉపయోగించినతరువాత స్విచ్ ఆఫ్ చేయాలన్నారు. లికేజీ పట్ల అప్రమరతంగా ఉండాలన్నారు. ఎల్లప్పుడూ సురక్ష ట్యూబ్ నే వాడాలన్నారు.మరేదైనా సమస్య ఉంటే 1906 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలనీ సూచించారు.ఈ కార్యక్రమంలో సిరిసిల్ల మునిసిపల్ చైర్ పర్సన్ జిందం కళ, కమీషనర్ D.లావణ్య ,సిరిసిల్ల AMC చైర్ పర్సన్ వెలుముల స్వరూప, మహిళా కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, నిర్వాహకులు రాజన్న సిరిసిల్ల జిల్లా LPG డిస్ట్రిబ్యూర్స్ అస్సోసియేషన్ బాద్యులు గడ్డం వేణు,గంప బాలకృష్ణ, దామోదర్ రావు, కిషోర్, షో రూమ్ మేనేజర్ శివ ప్రసాద్, గోపాల్, శ్రీకాంత్, డెలివరీ సిబ్బంది పాల్గొన్నారు.











Leave a Reply