మిత్రులందరికి నమస్కారం !నేను శంకర్ ఆకునూరి, రాజన్న సిరిసిల్లా జిల్లా, నేను కొంతమందికి తెలిసినా! ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తికి తెలియాలని భావిస్తున్నాను. నేను గత 2015 నుండీ ఇంద్రప్రభ,నవతెలంగాణ అను దిన పత్రికల్లో వివిధ హోదాలలో పని చేసి,నాకు సాధ్యమైనంత వరకు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని,ప్రభుత్వం,అధికారులు ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే వారి భరతం పట్టాలని అనేక కథనాలు,వార్తలు రాసాను!కాని పూర్తి స్థాయిలో విషయాలను,వాస్తవాలను ప్రజల ముందుంచలేకపోయాను. కారణం పత్రికల యజమానుల వైఖరి,వారి భావాలు! అవి నాకు సరిపడక, రాజీ పడలేక నేనే స్వయంగా ఓ వెబ్ సైట్ ఏర్పాటు చేశాను.
ఈ వెబ్ సైట్ కు నేనే కర్త,కర్మ,క్రియ,నా చానెల్ పేరు “నేటి భారతం…..ప్రశ్నించడమే పరిష్కారం” 🇮🇳 అనే ట్యాగ్ లైన్ తో మీ ముందుకు వార్తలను నిక్కచ్చి గా రాయడానికి వస్తున్నాను. మిత్రులారా నిజాలు నిర్భయంగా రాయడం రిపోర్టర్ల బాధ్యత,వాటి ఆధారంగా ప్రభుత్వాలను,పాలకులను ప్రశ్నించడం మీ (ప్రజల )బాధ్యత.
ఒక తప్పు జరుగుతుంటే, ఆ తప్పును మనం చూస్తూ వదిలేస్తే, అదే చట్టంగా,శాసనంగా మారుతుంది. అందుకే మీ కళ్ళ ముందు కనిపించే తప్పులను ప్రశ్నించండి. ప్రశ్నించడం వల్ల నష్టమేమి జరగదు. మనం అడవులకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆయుధాలు పట్టాల్సిన పనిలేదు, నెత్తురు చిందించాల్సిన పనస్సలేలేదు! కేవలం ప్రశ్నించడమే. 🫵
మనిషి తన నిత్య జీవితంలో తాను ఎదుర్కొంటున్న పలు సమస్యలైన తూకంలో మోసం,కల్తీ నూనెలు ,కల్తీ ఆహరం , కల్తీ నీరు, కల్తీ పెట్రోల్ రాష్ట్రంలో సిలబస్ అంత ఒకే మాదిరి అయినప్పుడు, పిల్లల బడి ఫీజుల్లో వ్యత్యాసం,నాణ్యత లేని ప్రభుత్వ వైద్యం,రైతుల సమస్యలు, పేదల బాధలు లాంటి ప్రజా సమస్యల పై నేటి భారతం 🇮🇳 కలంతో “కలుపు” తీయడానికి సిద్దంగా ఉంది, మీరు చేయాల్సిందంత వాస్తవాలను గ్రహించి ప్రశ్నించడమే. 🫵
నేటికి మనదేశంలో “దొడ్డు బియ్యం”తింటు బతుకులు వెళ్ళదీస్తున్న పేదలెందరో. మరి అ “దొడ్డు బియ్యం”పండించే రైతు పేదవాడు గానే ఉన్నాడు. “దొడ్డు బియ్యాన్ని”సరఫరా చేసే వ్యాపారి కోటిశ్వరుడు!
ఈ ప్రక్రియలో రైతుకు ప్రభుత్వం ఇచ్చే ప్రముఖ్యత ఎమిటి?ఏంత? ప్రపంచ దేశాల్లో కంటే మన దేశమే అత్యంత శక్తివంతమైన యువతరాన్ని కలిగి ఉంది. నేడు అదే యువత చదివిన చదువులకు సరైన ఉపాధి లేక చావలేక బతుకులు వెళ్ళదీస్తున్నారు. దేశంలోని పాలకులు ఆ దేశ ప్రజలకు విద్య,వైద్యం,ఉపాధి అవకాశాలు కల్పించి దేశాన్ని అభివృద్ది బాటలో నడిపించాలి, మరి పాలకులు ఎం చేస్తున్నారు? వారి వారసత్వానికి బంగారు బాటలు వేసుకోవడానికి దేశ సంపదను దొచుకుంటున్నారు.
మన దేశంలో 1956లో రైల్వే శాఖ మంత్రిగా ప్రజలు సేవలందించిన లాల్ బహదుల్ శాస్త్రీ , మొరదయలూర్ బ్రిడ్జ్ వద్ద జరిగిన ఘటన కు బాధ్యత వహించి తన పదవికి రాజీనామ చేసిన నాయకుని వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న ఈ దేశ రాజకీయాలలో , అవినీతి ,అక్రమాలు,స్కాంలు,పేపర్ లీకేజిలు ఎలా జరుగుతున్నాయి? కేవలం పేద,సామాన్య,మధ్యతరగతి ప్రజల మౌనం వల్ల, మీరు ప్రశ్నించకపోవడం వల్ల,మీరు ప్రభుత్వాలను నిలదీయలేకపోవడం వల్ల!
అందుకె నేటి భారతం 🇮🇳 ప్రజా సమస్యల పై సమగ్ర వివరణతో ,సరైన సాక్షాలు,ఆధారాలతో మీ కొరకు,మీతో కలిసి ప్రశ్నించడానికి మీ ముందుకు వస్తుంది, మీ సహకారం అందిస్తారని,ఉంటుందని ,నేను రాసిన కథనాలు, వార్తలు నచ్చితే like లేదా dislike ద్వారా తెలుపుతారని ఆశిస్తూ…..
మీ శంకర్ ఆకునూరి.











Leave a Reply