
జులై 18/26 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
రాజన్న జిల్లా పరిధిలోని మొబైల్ షాపుల్లో సెకండ్‌హ్యాండ్ మొబైల్ విక్రయిస్తున్న వారి పూర్తి వివరాలు నమోదు చేసుకోవాలని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే అన్నారు.శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా పరిధిలోని పలు మొబైల్ షాప్స్ , రిపేర్ షాప్స్ యజమానులతో ఎస్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,జిల్లాలో వివిధ సందర్భాల్లో దొంగలించబడిన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్స్ అమ్మడానికి / ఎక్స్చేంజ్ చేయడానికి వచ్చిన వారి పట్ల, అప్రమత్తంగా వ్యవహరిస్తు వారి ఆధార్ కార్డ్ తో పాటు పూర్తి వివరాలు సేకరించాలన్నారు.ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా, దొంగిలించిన మొబైల్ ఫోన్ల విక్రయానికి ప్రయత్నిస్తున్నట్లు అనుమానం వచ్చినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు. మొబైల్ ఫోన్ దొంగలను పట్టించడంలో , వారి ఆచూకీ పోలీసులకు అందించడంలో సహకరించిన మొబైల్ షాప్ యజమానులకు జిల్లా పోలీస్ ప్రశంసాపత్రం అందజేయడం జరుగుతుందన్నారు.ఎవరైన మొబైల్ పోగొట్టుకున్న, దొంగిలించబడిన వెంటనే CEIR పోర్టల్ ( https://www.ceir.gov.in ) నందు బ్లాక్ చేసి, సంభందిత పోలీసు స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటి కోర్ ఎస్.ఐ కిరణ్ కుమార్, కానిస్టేబుల్ రాజాతిరుమలేష్, మొబైల్ షాప్స్ యజమానులు పాల్గొన్నారు.










Leave a Reply