మెప్మా లో విజిలెన్స్ ఎంక్వయిరీ చేయాలి.

Published by

on

ఫిర్యాదు పత్రం

సెప్టెంబర్07/26 : నేటి భారతం.

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని, మెప్మా లో విజిలెన్స్ ఎంక్వయిరీ చేయాలని, మెప్మాలో అక్రమాలకు పాల్పడుతున్న వారిని వెంటనే తొలగించాలంటూ,cpm పట్టణ సెక్రటరీ ఎలిగేటి రాజశేఖర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కి ఫిర్యాదు చేశారు. మెప్మా సంస్థలో విధులకు హాజరుకాని సిబ్బందికి ఫోర్జరీ సంతకాలు చేస్తూన్నారని ఆరోపించారు. అతి తక్కువ వేతనంతో విధులు నిర్వహిస్తున్న మెప్మా సంస్థలో  ఓ కీలక  ఉద్యోగి , కోట్ల రూపాయల విలువ చేసి  భవనాన్ని నిర్మించడం అంటే ఆమె ఎంతటి అవినీతికి పాల్పడుతుందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. మెప్మా సంస్థలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ కు పలుమార్లు ఫిర్యాదు చేసిన, పట్టించుకోలేదన్నారు. గత  జూలై 27 న ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తే , కలెక్టర్ స్పందించి సదరు ఉద్యోగులను బదిలీ చేయాలంటూ, తెలంగాణ మెప్మా  కమిషనరేట్ కు లేఖ పంపారని తెలిపారు. ఈ విషయమై సంస్థా జిల్లా ఏవో ను వివరణ కోరతే, సదరు ఉద్యోగలను బదిలీ చేస్తే, సంస్థ కార్యాలయంలో విధులు నిర్వహించడానికి , హెడ్ ఆఫీస్ నుండి ఉద్యోగులు వస్తే బదిలీ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. మెప్మా సంస్థలో సుదీర్ఘకాలం ఒకే స్థానంలో విధులు నిర్వహించడం వల్లే అవినీతి అక్రమాలకు పాల్పడే వీలవుతుందని, వీరందరిని వెంటనే మరో సంస్థకు బదిలీ చేయాలని, సంస్థ కు చెడ్డ పేరు తెస్తున్న వారిని ఉద్యోగంలో నుండి తొలగించాలంటూ అధికారులను కోరినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Leave a Reply

September 2026
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading