

జులై 17/26 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
విరుగుడే లేని గడ్డి మందు తాగి, యువకులు, రైతులు పిట్టల్లా రాలిపోతుంటే తెలంగాణ ప్రభుత్వం గడ్డి మందు అమ్మకాన్ని నిషేధించింది. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కొంతమంది ఫర్టిలైజర్ షాప్ యజమానులు గుట్టు చప్పుడు కాకుండా గడ్డి మందును అమ్ముతున్నారు. ఈ విషయంలో విస్తృత తనిఖీ చేయాల్సిన వ్యవసాయ రంగ అధికారులు ఆఫీసులకే పరిమితమైనట్లు కనిపిస్తుంది. జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కాలేజ్ పక్కన, పాత ఎల్లమ్మ గుడి పక్కన ఉన్న , వ్యవసాయ క్షేత్రాలలో రైతులు గడ్డి మందు వాడటం కనిపిస్తుంది. ప్రభుత్వం నిషేధించిన గడ్డి మందును, జిల్లా వ్యవసాయ రంగ అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే గడ్డి మందు అమ్మకాలు పెరుగుతున్నాయి. అత్యంత ప్రాణాంతకమైన గడ్డి మందు వినియోగం పట్ల జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.











Leave a Reply