నేటిభారతం ( ప్రశ్నించడమే పరిష్కారం) : కేటిఆర్ కు మైనారిటిలు,బి.సిల పై అంత ప్రేముంటే సిరిసిల్లా నియోజకవర్గం బిఆర్ ఎస్ ఎమ్మేల్యే టిక్కెట్ పొన్నాల లక్ష్యయ్యకివ్వాలని రాజన్న సిరిసిల్లా జిల్లా కాంగ్రెస్ పార్టి జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ పాష అన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ, మొన్నటి సిరిసిల్లా బిఆర్ ఎస్ సభలో జిల్లా మైనారిటిలందరు బిఆర్ఎస్ పక్షాన ఉన్నారంటు,కేటిఆర్ కు సిరిసిల్లా సదరుగా చెప్పుకుంటున్న సలీం అందజేసి డిక్లరేషన్ను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. మైనారిటిలు వివిధ పార్టిలలో ఉన్నారని,వారి అభిప్రాయాలను తెలుసుకొకుండా ఎలా డిక్లరేషన్ ఇస్తారని ప్రశ్నించారు. ఇదంత వారి స్వలాభం కోసమేనని దుయ్యబట్టారు.వారికి బిఆర్ ఎస్ పై ప్రేముంటే స్వంత డిక్లరేషన్ ఇచ్చుకొవాలని సూచించారు.సలీం కేవలం సిరిసిల్లాకే పరిమితమని గుర్తు చేశారు. మైనారిటిలకు 12% రిజర్వేషన్ అందిస్తానన్న బిఆర్ ఏస్ పార్టి నేటికి ఎందుకు అమలు చేయలేదో సలీం కేటిఆర్ ను అడగాలని అన్నారు. మైనారిటి బంధు కేవలం బిఆర్ ఎస్ పార్టిలో ఉన్న వారికే ఇచ్చారని, మిగత వారందరికి ఏందుకు ఇప్పించలేదని ప్రశ్నించారు. బిఆర్ ఎస్ మైనారిటిలకు చేస్తుంది కేవలం మోసం,దగ, ఓటు బ్యాంక్ రాజకీయమేనని ద్వజమేత్తారు.మైనారిటి ఇలాంటి అబద్దాలను,మోసపూరిత మాటలను నమ్మోద్దని,మైనారిటి సంక్షేమం కోరేది కేవలం కాంగ్రెసేనని తెలిపారు.రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టి జిల్లా,పట్టణ నాయకులు ఏం.డి ఫయాజుద్దిన్ ,అహ్మద్ ఖాన్ ,ఖాజామైనోద్దిన్ , షేక్ రియాజ్ ,మతిన్ తదితరులు పాల్గొన్నారు.
For లోకల్ అడ్స్
Contact: +91 92969 05070











Leave a Reply