



*మైనర్ బాలికలకు రక్షణగా ఫోక్సో చట్టం.
*అనాధ పిల్లలకు ప్రభుత్వం చేయూత నిస్తుంది.
*చట్ట బద్ధమైన దత్తత అన్ని విధాలా మంచిది.
ఏప్రిల్ 27/26 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
14సo -18సం రాల మధ్య వయస్సు గల పిల్లలు చెడు వ్యాసనాలకు దూరంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా (డీసీపీఓ) డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కవిత అన్నారు.సోమవారం సిరిసిల్ల పట్టణ కాలేజీ గ్రౌండ్ లో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా ‘పాలన-ప్రగతి ప్రణాళిక’ 99రోజుల కార్యక్రమంలో భాగంగా యుక్త వయస్సు పిల్లలకు pocso యాక్ట్ , డ్రగ్ అడిక్షన్,పిల్లల భద్రత పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,0-18 సం రాల పిల్లలు ఎవ్వరైనా ఆపదలో ఉంటే 1098 కాల్ చేయవచ్చన్నారు. 18 సం రాల లోపు ఆడ పిల్లలు గర్భం దాల్చిన, కిడ్నాప్ కు గురైనా వాటికి కారణమైన వారిపై pocso యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.దత్తత చట్టభద్ధంగా తీసుకోవడమే అన్ని విధాలా మంచిదని తెలిపారు. తల్లిదండ్రులు లేని మైనర్ పిల్లలకు ప్రభుత్వం ప్రతి నెల 4వేలు అందిస్తుందని, ఎవరైనా అనాధ పిల్లలు ఉంటే 871261111 నెంబర్ కు సమాచారం అందించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ సీ ఐ ఎన్. శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది,పట్టణ ప్రజలు పాల్గొన్నారు.











Leave a Reply