• ఓట్ల కోసం రాజకీయ నాయకుల అడ్డదారి.
• ఒక్క ఇంట్లో రెండు పెన్షన్లు…?
•ఉపాధ్యాయులు, సాఫ్ట్వేర్ ఉద్యోగుల, తల్లిదండ్రులకు వృద్ధాప్య, బీడీ పెన్షన్….?
•ప్రజాధనాన్ని కాపాడాల్సిన ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులతో కుమ్మక్కు….?
జులై 28/26 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
గత బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో, రాజన్న సిరిసిల్ల జిల్లా లోని,సిరిసిల్ల మున్సిపల్ కు ప్రాతినిధ్యం వహించిన నాయకులు, వారు పదవులు అనుభవించడానికి అనర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించి ఓటు బ్యాంకును కాపాడుకుంటూ, రెండు సార్లు పదవులు అనుభవించారని చెప్పడానికి ఈ కథనమే సాక్ష్యం. నేటి భారతం ప్రతినిధి సేకరించిన వివరాల ప్రకారం, సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని, 39 వార్డులలో , కొంత మంది కౌన్సిలర్లు అనర్హులకు ఆసరా పెన్షన్లు అందించారు. పలు వార్డ్ లలో సంపన్న కుటుంబాలకు ఆసరా పెన్షన్లు వస్తుంటే, మరో వార్డులో వారి పిల్లలందరూ ఉన్నత విద్యావంతులు, ఉద్యోగస్తులు అయినా వారికి ఆసరా పెన్షన్ అందుతుంది. మరో వార్డులో వార్డు కౌన్సిలర్ అనుగ్రహం వల్ల డబ్బులను వడ్డీలకు ఇస్తున్న వారి కుటుంబం కూడా ఆసరా పెన్షన్ పొందుతుంది. ప్రభుత్వ నుండి వస్తున్న డబ్బులే కదా..? అంటూ సదరు కౌన్సిలర్లు చేసిన పొరపాటు, అన్ని వసతులు హంగులు, ఆర్భాటంతొ జీవనాన్ని గడుపుతున్న వారికి ‘ఆసరా’ అదనపు ఆదాయ వనరులుగా మారింది. ఇప్పటికైనా సిరిసిల్ల మున్సిపల్ అధికారులు నిస్వార్ధంగా విచారణ చేపడితే అసలు రంగు బయటపడుతుందని నేటి భారతం ఉద్గటిస్తోంది. మరి సిరిసిల్ల మున్సిపల్ అధికారులు, పాలకవర్గం విచారణ చేపట్టి అర్హులకు పెన్షన్ అందేలా చూస్తారా లేదా చూడాలి.










Leave a Reply