“నేటి భారతం’
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
Dec 05, 2024.
BRS నియంతృత్వ పాలనలో కేవలం కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు లకే ఉద్యోగాలోచ్చాయని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజక వర్గం ఇంచార్జ్ కె. కె మహేందర్ రెడ్డి అన్నారు.సిరిసిల్ల లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహిస్తే జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు.BRS హయాంలో రిటైర్మెంట్లే కాని రిక్రూట్మెంట్ లేవని,కాంగ్రెస్ ప్రజపాలనలో 55,160 ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు.తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరిస్తే, BRS 10ఏళ్ల లో 100ఏళ్ల దోపిడీ చేసారాని,కూటికి లేనివారు కోటేశ్వరులైయ్యారని డ్యూయ్యాబట్టారు. మీ చరిత్ర అందరికి తెలుసని, మీకు వందల ఎకరాలు, ఫామ్ హౌస్ లు ఎలావచ్చాయ్యని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుంటే అడ్డుకోవడం మానుకోవాలని హితావు పలికారు.ఈ నెల 7నుండి 9వరకు నిర్వహించే ప్రజా పాలనా విజయోత్సవా లలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలనీ కోరారు.











Leave a Reply