


Dec: 24/24 “నేటి భారతం’
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
అమిత్ షా అహంకార పూరిత మాటలు దారుణమని, షాను వెంటనే మంత్రివర్గం నుండీ భర్తరఫ్ చేయాలని ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ అన్నారు. పార్లమెంట్ సమావేశంలో అంబేద్కర్ పై కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వాక్యాలు ఖండిస్తూ, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,భారతీయ జనతా పార్టీలో రెండవ స్థానంలో,దేశానికి హోం మంత్రిగా ఉన్న అమిత్ షా అంబేద్కర్ పై చేసినవాక్యాలనుతీవ్రంగాఖండిస్తున్నామన్నారు. షా ను వెంటనే మంత్రివర్గంలో నుండీ భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.బిజెపి ప్రభుత్వం దేశంలోని పేదల సంపదను ఆదాని అంబానీలకు దోచుపెడుతుందన్నారు. 2014 సంవత్సరంలో సంపన్నుల జాబితాలో 600 పై చీలుకు ఉన్న ఆదానీ, నేడు రెండవ స్థానానికి ఏ విధంగా ఏగబకారో సమాధానం చెప్పాలన్నారు.మణిపూర్లో ప్రజలు వారి హక్కులను కోల్పోతున్న ప్రధాని మోడీ, అమిత్ షా వారి గురించి పట్టించుకోవడం లేదని,మణిపూర్ లో జరుగుతున్న సంఘటనల పై నోరు మెదపని భారతీయ జనతా పార్టీ వైఖరిని కాంగ్రెస్ పార్టీ పక్షాన తప్పు పడుతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సిరిసిల్ల నియోజక వర్గ ఇంచార్జ్ k. K మహేందర్ రెడ్డి, జిల్లా గ్రంధాలయం ఛైర్మెన్ నాగుల సత్యనారాయణ,సిరిసిల్ల AMC చైర్ పర్సన్ వెలుముల స్వరూప,కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, గడ్డం నర్సయ్య, సంగీతం శ్రీనివాస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











Leave a Reply