జూన్ 30/26 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల మానేరులోకి రసాయనపు నీరు(రంగుల అద్ధకం నీరు ) యద్దేచ్చగా పారుతోంది.20 ఏళ్ల క్రితం స్వచ్ఛమైన మా’నీరు’ పారుతూ సిరిసిల్ల పట్టణ ప్రజల దాహర్తి తీర్చినా మానేరు వాగు నేడు వ్యర్థ పదార్థాలతో,మురుకి కాలువల నీరుతో, రసాయనపు రంగు నీరు కలుస్తూ కాలుషతం అవుతుంది. వాగు పక్కన ఉన్న గృహ సముదాయాల వారు వ్యర్థ పదార్థాలు వేస్తుండగా, మరోపక్క ప్రేమ్ నగర్ పక్కనే మానేరు వాగును అనుకోని ఉన్న సైజింగ్ లో వస్త్రాలకు రంగులు అద్దుతూ వస్త్ర ఉత్పత్తి చేస్తుండగా, ఆ సైజింగ్ నుండి వెలువడుతున్న రసాయనపు రంగు నీరు మానేరులో కలుస్తుంది.పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన సిరిసిల్ల మున్సిపల్ అధికార యంత్రాంగం, ప్రజలు పిర్యాదు చేస్తే తప్ప వారి, రోజువారి విధులు గుర్తుకు రాని పరిస్థితి ఉంది. మానేరు వ్యర్థాలతో, రసాయనపు రంగు నీరుతో కంపుకొడుతుంటే సిరిసిల్ల కు జాతీయ స్థాయిలో స్వచ్ఛ సిరిసిల్ల అవార్డ్ ఎలా వచ్చిందో బోధపడటం లేదు.మానేరు పూర్తిగా రసాయనపు నీరుతో కాలుషతం కాక ముందే సిరిసిల్ల మున్సిపల్, ఛైర్పర్సన్, కమిషనర్ వెంటనే కలుషితానికి కారణమైన బాధ్యులపై పై చట్ట పరమైన చర్యలు తీసుకుంటే, మరో వ్యాపారి ఇలాంటి పొరపాట్లు చేయకుండా ఉంటారని, ప్రజలు భావిస్తున్నారు. మరి మునిసిపల్ ఛైర్పర్సన్,కమీషనర్ లు బడా వ్యాపారని చూసి చూడనట్టు వదిలేస్తారా….?మానేరు కలుషితం కాకుండా చూస్తారా వేచి చూడాలి.










Leave a Reply