
జూన్ 30/26 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
మానేరులోకి రసాయనపు రంగు నీరు….? శీర్షికన ‘నేటి భారతం’ రాసిన వార్తకు రాజన్న సిరిసిల్ల జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ టీ. హన్మంత్ స్పందించారు.అధికారులు పరిశ్రమను సందర్శించి, రికార్డ్స్ తనిఖీ చేశారు. పరిశ్రమ నుంచి వెలువడుతున్న నీటిని పరిశీలించి, నీరు మానేరులోకి వెళ్లకుండా తగు జాగ్రత్త తీసుకోవాలని సూచనలు చేశారు. సూచించిన పనులన్నీ పక్షం రోజుల్లో పూర్తి చేయాలని లేని పక్షంలో శాఖ పరమైన చర్యలు ఉంటాయని సైజింగ్ యజమానికి తెలిపారు.










Leave a Reply