జులై 01/26 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బాలాజీ స్వీట్ హౌస్ ను జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష సీజ్ చేసారు. మంగళవారం సాయంత్రం వినియోగదారుడు కొనుగోలు చేసినా కార లో బల్లి ఉందని,స్వీట్ హౌస్ హాజమానికి పిర్యాదు చేస్తే, నిర్లక్ష్యంగా సమాధానమే ఇవ్వడం కాకుండా, కిలోకు రెండు కిలోల కార తీసుకో అని నిర్లక్ష్యంగా మాట్లాడటం, వినియోగదారున్ని బెదిరించడం తో,సదరు వ్యక్తి తనకు జరిగిన అన్యాయం పై పోలీస్ కు, ఫుడ్ ఇన్స్పెక్టర్ కు పిర్యాదు ఇవ్వడం తో వారు బుధవారం బాలాజీ స్వీట్ హౌస్,స్వీట్ తయారీ కేంద్రాన్ని తనిఖీ చేసారు.పలు స్వీట్స్ సేకరించి పరీక్షల నిమిత్తం పంపారు. ఈ తనిఖీలు మున్సిపల్ సానిటేషన్ అధికారులు రడం శ్రీనివాస్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply