అక్టోబర్ 01/26 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
* సుమారు లక్ష ఎకరాలకు శాశ్వత సాగునీరు అందించాలి: కటకం మృత్యుంజయం.
ఎగువ మానేరు 9వ ప్యాకేజీ పనులను వెంటనే చేపట్టి పూర్తి చేసి సుమారు లక్ష ఎకరాల ఆయకట్టుకు శాశ్వత సాగునీరు అందించాలని కాంగ్రెస్ నాయకుడు కటకం మృత్యుంజయం కోరారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎగువ మానేరు ప్రాజెక్టును పరిశీలించి, 9వ ప్యాకేజీకి అవసరమైన నిధులు మంజూరు చేసి నిర్దిష్ట కాలపరిమితిలో పనులు పూర్తి చేయించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కుడి, ఎడమ కాలువల్లో దెబ్బతిన్న లైనింగ్‌ను పునరుద్ధరించి నీటి వృథాను అరికట్టాలని కోరారు.ఎగువ మానేరు రిజర్వాయర్ పరిసరాలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి వ్యూ పాయింట్లు, వాకింగ్ ట్రాక్‌లు, అవసరమైన చోట్ల బోటింగ్ సదుపాయాలు కల్పించాలని ఆయన సూచించారు. దీంతో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మృత్యుంజయం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిరిగిరి కిషోర్ , రాగుల రాములు తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply