సెప్టెంబర్24/26 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
మాకెప్పుడయ్య నిమజ్జనం…? అని ఏకదంతుడైన ఆదిదేవుడు సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ , కమిషనర్లను అడుగుతున్నాడు. వినాయక చవితి పర్వదిన సందర్భంగా పలువురు వ్యాపారస్తులు సిరిసిల్ల పట్టణంలో వివిధ ప్రదేశాలలో వినాయక విగ్రహాలు ఉంచి విక్రయించారు. నవరాత్రులు గడుస్తున్న కొంతమంది వ్యాపారులు వినాయక విగ్రహాలను రోడ్డుపైనే వదిలేయడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాసవి కళ్యాణ మండపం వద్ద ఉన్న పలు వినాయక విగ్రహాలు గత సంవత్సరం నుండి రోడ్డుపైనే వదిలేయగా నేటికి మునిసిపల్ సిబ్బంది వాటిని నిమజ్జనం చేయకపోవడం శోచనీయం. సోషల్ మీడియాలో ఊదరగొడుతున్న యువత కనీసం ఇటువైపు కన్నెత్తి చూడడం లేదని బొజ్జ గణపయ్య మౌనంగా ఉన్నాడు. ఇకనైనా మున్సిపల్ అధికారులు స్పందించి వాసవి కళ్యాణ మండపం, మున్సిపల్ వెనకాల ఉన్న శివాలయం , యాక్సిస్ బ్యాంక్ వద్ద రోడ్డుపై ఉంచిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయాలని “నేటి భారతం’అధికారులకు విజ్ఞప్తి చేస్తుంది.










Leave a Reply