
అక్టోబర్ 05/26 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
రాజకీయ నాయకులను ముఖ్యఅతిథిగా ఆహ్వానించి షాపింగ్ మాల్, హోటల్లు, బట్టల దుకాణాలను ప్రారంభిస్తే, ఏ సమస్య వచ్చినా చిటికెలో పరిష్కారం అయిపోతుందనే ఆలోచనతో నాయకులను ఆహ్వానిస్తారా….? అని ప్రజలు చర్చించుకుంటున్నారు. సిరిసిల్లలో విస్తరిస్తున్న వ్యాపార కేంద్రాల వల్ల ఏర్పడే ట్రాఫిక్ సమస్యలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రోడ్డు మార్గాలకు పక్కన నెలకొల్పుతున్న వ్యాపార కేంద్రాల వల్ల , వినియోగదారులు ఆయా వ్యాపార సంస్థల ముందు వారి వాహనాలు పార్కు చేయడం తో, పాదాచార్ల, వాహనదారుల రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురౌతున్నాయి .రోడ్డు ముఖంగా వ్యాపార సంస్థలు నెలకొల్పితే ట్రాఫిక్ సమస్యలు ఉంటాయని తెలిసి, వ్యాపారస్తులు వారి షాపులను ప్రారంభించే సమయంలో, రాజకీయ నాయకులను ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానిస్తున్నారనడానికి సిరిసిల్ల పట్టణం లోని, పాత బస్టాండ్ వద్ద ఉన్న సురభి హోటల్ దాని పక్కనే ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హాస్పిటల్స్, ఈ మధ్య కొత్తగా పాత పెట్రోల్ పంపు వద్ద నూతనంగా ప్రారంభించిన కిడ్స్ వరల్డ్ ఉదాహరణ. సిరిసిల్ల పట్టణంలో ఏ కొత్త హాస్పిటల్ ,టిఫిన్ సెంటర్, బిర్యాని సెంటర్లు ప్రారంభించాలన్న ఆహ్వానితులుగా రాజకీయ నాయకులను పిలవడం ఆనవాయితీగా మారిపోయింది. రాజకీయ నాయకులను ఆహ్వానితులుగా పిలవడం వల్ల, భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలు తలెత్తినప్పుడు ఆ సమస్యలను అధిగమించడానికి రాజకీయ నాయకుల సపోర్ట్ ఉంటుందనే ఆలోచనతో యజమానులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
చూసి చూడనట్టుగా ఉంటున్న పోలీసులు..?
సిరిసిల్ల పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట ట్రాఫిక్ సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే స్పందించి ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించాల్సిన పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలోగుతున్నట్టు పట్టణంలో చర్చ జరుగుతుంది. ఒకవేళ రాజకీయ ఒత్తిళ్లకు పోలీసులు తలగ్గొనట్లయితే, దారి పొడవునా రోడ్డు మీద బార్లా గా వాహనాలు ఎందుకు నిలుపుతారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా పోలీసులు, ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్న సామాన్య జనాలకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత వారిపైన ఉందని నేటి భారతం గుర్తుచేస్తోంది.మరి సిరిసిల్ల మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు ఈ సమస్యకు పరిష్కారం చూపుతారా లేదా వేచి చూడాలి.










Leave a Reply