* సెప్టెంబర్ 17లోపు తెలంగాణ ఉద్యమకారుల హామీలు నెరవేర్చాలి.
* తెలంగాణ ఉద్యమకారుల JAC రాజన్న సిరిసిల్ల జిల్లా చైర్మన్ గజ్జల దేవరాజు.
సెప్టెంబర్01/26 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమకారులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే గుర్తించి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాజన్న సిరిసిల్ల జిల్లా చైర్మన్ గజ్జెల దేవరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బి, వై, నగర్‌కు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు మేకల రామచంద్రం అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకుని, ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో ఆయనను పరామర్శించి, ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా దేవరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులు నేడు అనారోగ్యంతో, ఆర్థిక ఇబ్బందులతో జీవించాల్సిన పరిస్థితి రావడం బాధాకరమన్నారు. ప్రభుత్వం ఇకనైనా ఉద్యమకారులను ఆదుకుని వారికి న్యాయం చేయాలని కోరారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, పింఛన్, ఉద్యమకారులపై ఉన్న కేసుల ఎత్తివేత, మరణించిన ఉద్యమకారుల కుటుంబాలకు పింఛన్, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వంటి హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ కమిటీల పేరుతో కాలయాపన చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని , లేనిపక్షంలో ఉద్యమకారుల ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫణిరాజారావు వికాస్ సమితి జిల్లా అధ్యక్షులు, మాజీ సర్పంచుల JAC రాష్ట్ర అధ్యక్షులు అక్కెనపెల్లి కరుణాకర్,కుసపెల్లి సరస్వతి, సింగారం దేవరాజు,కర్నె లక్ష్మీ, గూగులోతు రేనా,పత్తిపాక పద్మ, మామిడాల రమణ, నేరేళ్ల శ్రీకాంత్ గౌడ్, ఓదెల శ్రీనివాస్, అప్రోజు, సికిందర్, పవన్, సాయిశరత్, సాయి గౌడ్, చోటు బాబా తదితరులు పాల్గొన్నారు.











Leave a Reply