కౌన్సిలర్లు కంపు కొడుతుందయ్యా….!

Published by

on

మురికి నీరు రోడ్డుపైకి వస్తున్న దృశ్యం

ఆగస్టు 02/26 : నేటి భారతం.

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

అయ్యా కౌన్సిలర్లు…! రాంగ పోంగ కంపు కొడుతుంది… ఈ సమస్యకు పరిష్కారం చూపండయ్య.. అంటూ 3 వార్డుల కౌన్సిలర్లను ప్రజలు కోరుతున్నారు. వివరాల్లోకి వెళితే, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కు దగ్గరగా, దోభి గల్లీ, రెడ్డి వాడ, బోయవాడ, అంబేద్కర్ నగర్, లను కలుపుతూ ఉన్న రోడ్డు పై నిత్యం మురికి నీరు పారుతుంది.ఈ మార్గం గుండా  3వార్డుల ప్రజలు నిత్యం బస్టాండ్, కూరగాయల మార్కెట్, స్కూళ్లకు వెళుతూ ఉన్న సందర్భాలలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు వాపోతున్నారు. ఈ ప్రదేశంలో  కేవలం 20 మీటర్ల డ్రైనేజ్ నిర్మాణం చేపడితే ఎలాంటి సమస్య ఉండదని ప్రజలు కోరుతున్నారు. మరి ఈ వార్డు కౌన్సిలర్లు స్పందిస్తారా లేదా వేచి చూడాలి.

Leave a Reply

September 2026
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading