అక్టోబర్ 09/26 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
అడిగేవారు లేరని ధరలు పెంచుతూ, సామాన్యునికి మిట్ట మధ్యాహ్నమే ఆకాశంలో చుక్కలు చూపిస్తున్నారు మాంసం విక్రయదారులు. వివరాల్లో వెళితే, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రమైన సిరిసిల్ల పట్టణంలో, జిల్లాలో ఎక్కడా లేనివిధంగా మటన్ ధరలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం దసరా పండగ పూట 100రూ. పెంచుతూ, ఇప్పుడు కిలో మాంసం ధర 1000/- రూపాయలు చేశారు. ప్రభుత్వ ఆదేశాలు లేకుండా, యుద్ధం పేరు చెప్పుతూ నిత్యవసర సరుకుల ధరలను, బియ్యం ధరలను, పెంచి వ్యాపారులు సామాన్యుడిని నిలువన దోపిడీ చేస్తుంటే, పెత్తరమాస (పెద్దలకు బియ్యము ఇవ్వడం) దసరా సందర్భాలను అనువుగా మార్చుకొని సిరిసిల్ల పట్టణంలోని మాంసం విక్రయ దారులు కిలో మాంసం ధరను 1000/- చేసినా… నియంత్రించాల్సిన జిల్లా కలెక్టర్ జిల్లా యంత్రాంగం సామాన్యుని సమస్యలు పట్టించుకోకపోవడం శోచనీయం. జిల్లాలో మేకలు, గొర్రెల ఉత్పత్తి మెండుగా ఉన్న, మాంసం విక్రయాలు మాత్రం పండగ పూట ధరలు పెంచి సామాన్యుని నడ్డి విరుస్తున్నారు. ఇకనైనా స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జిల్లాలో వ్యాపారుల దోపిడిని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.










Leave a Reply