
ఏప్రిల్ 4/26 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
NCC తో క్రమశిక్షణ.. దేశభక్తి.. ఉద్యోగ అవకాశాలు ఉంటాయని కేర్ టేకర్ సంతోష్ రెడ్డి తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా శివనగర్‌లోని కుసుమరామయ్య ఉన్నత పాఠశాలలో ఎన్సీసీ (NCC) పరేడ్, తరగతుల ప్రారంభోత్సవం శనివారం జరిగింది. ఎన్సీసీ(NCC) సిబ్బంది, కేర్‌టేకింగ్ ఆఫీసర్ (CTO) ఆధ్వర్యంలో క్యాడెట్లకు డ్రిల్స్, పరేడ్ విధానాలు, ప్రాథమిక శిక్షణను అందించారు. శిక్షణలో విద్యార్థులు క్రమశిక్షణతో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది.ఈ సందర్బంగా పాఠశాల సిటిఓ(CTO) మాట్లాడుతూ, ఈ సంవత్సరం 25 మంది విద్యార్థులు ఎన్సీసీకి ఎంపికయ్యారని తెలిపారు. రాబోయే సంవత్సరంలో ఈ సంఖ్యను 50 మందికి పెంచే లక్ష్యంతో ఉన్నట్లు ప్రకటించారు. రిపబ్లిక్ డే పరేడ్, వివిధ శిబిరాలు, అనేక అవకాశాలు ఎన్సీసీలో ఉన్నాయని, వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయ బృందం పాల్గొని విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశాలు అందించారు. ఎన్సీసీ ద్వారా క్రమశిక్షణ, దేశభక్తి వంటి విలువలు అలవాటు అవుతాయని, భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదగడానికి ఇది ఒక ఉత్తమ వేదిక అని పేర్కొన్నారు. చదువుతో పాటు ఇలాంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని పాఠశాలకు, తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.జిల్లా కేంద్రం లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం పరచుకోవాలని కోరారు.











Leave a Reply