
ఆగస్టు 30/26 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ ఉద్యమకారుల JAC ఛైర్మెన్ గా గజ్జెల దేవరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో, తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాల్గొన్న వివిధ ఉద్యమ సంఘాల నాయకులందరూ రాజన్న సిరిసిల్ల జిల్లా JAC చైర్మన్ గా దేవరాజును ప్రకటించారు. అనంతరం గజ్జెల దేవరాజు మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం వారి మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పిస్తామంటూ, ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు 200 గజాల నివాస స్థలము, పెన్షన్ అందిస్తామని ప్రకటించారన్నారు. 3 సంవత్సరాలు కావస్తున్న, ఏలాంటి కార్యచరణ చేపట్టకపోవడం వారి కార్య దక్షతకు నిదర్శనం అన్నారు. కేశవరావు కమిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం నేటికీ ఎలాంటి విధి విధానాలు తెలియజేయలేదని విమర్శించారు. కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్న ప్రభుత్వం, సెప్టెంబర్ 17 లోపు ఉద్యమకారులకు నివాస స్థలము, పెన్షన్ అందించలేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం నాయకులు బుస వేణు, కుసుమ విష్ణు, పత్తిపాక పద్మ, రాచర్ల వెంకన్న, ఫణి రాజారావు, గుగులోతు రేణుక, బండి దేవదాస్, మడుపు వనజ, ఉద్యమకారులు పాల్గొన్నారు.











Leave a Reply