నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
మన చుట్టూ ఉన్న ఇసుక, గుట్టలు, అడవులు, మట్టిదిబ్బలు,అన్యాక్రాంతమౌతూ,కనుమరుగోతున్నాయని,సహజ వనరుల సంరక్షణ మనందరి భాద్యత అని, తెలంగాణ సహజ వనరుల పరిరక్షణ సమితి తెలిపింది. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో స్థానిక ప్రెస్ క్లబ్ లో తెలంగాణ సహజ వనరుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా, సమితి వ్యవస్థాపకులు దేవయ్య మాట్లాడుతూ, జూన్ 5న ప్రపంచ పర్యవన దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని,చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనంలో ఉదయం 11 గంటలకు సమావేశము నిర్వహించనున్నట్లు అయన తెలిపారు.ఈ సమావేశానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సామాజిక ఉద్యమకారులు, మేధావులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, కార్మికులు, యువత, మహిళలు, కర్షకులు, అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని పిలుపునిచారు.సమావేశం ముఖ్య ఉద్దేశం ఇసుక, గుట్టలు, అడవి ప్రాంతంల అన్యాక్రాంతా న్ని అదుపుచేయడం.సహజవనరుల సంరక్షణ కు ప్రతి ఒక్కరు నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు.ఈ సమావేశంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయగలరని కోరారు.ఈ సమావేశంలో సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రగిరి గోపాలస్వామి, రాష్ట్ర కోశాధికారి వాసం మల్లేశం యాదవ్, జిల్లా కమిటీ నాయకులు ఎడ్ల రాజకుమార్, చొప్పదండి లక్ష్మణ్, బిజెపి నాయకులు పత్తిపాక సురేష్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.











Leave a Reply