* జిల్లా రవాణా శాఖ అధికారి వీ. లక్ష్మణ్.
రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి.
నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వాణిజ్య, వాణిజ్యేతర వాహనదారులు, తమ వాహనాల పన్ను రవాణా శాఖకు చెల్లించాలని జిల్లా రవాణా శాఖ అధికారి వీ. లక్ష్మణ్ తెలిపారు. పన్ను చెల్లించన్ని వాహనాలు తనిఖీల్లో పట్టుబడితే, సంబంధిత వాహనం పన్నుపై అపరాధ రుసుం మొదటి నెల 50 శాతం, రెండో నెల 100 శాతం, మూడో నెలలో 200 శాతంతో అదనంగా వసూలు చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలోని వాణిజ్య, వాణిజ్యేతర వాహనదారులు గమనించి సకాలంలో తమ వాహన పన్నును చెల్లించాలని సూచించారు.











Leave a Reply