• కాంట్రాక్టు పనులకే ఆసక్తి, పబ్లిక్ అనులకు అనాసక్తి.
• పబ్లిక్ అనుగుణంగా పారిశుధ్య కార్మికులు!
అయినా, పడకేసిన పారిశుధ్యం.
• తీసిన షీల్ట్ మురికి కాల్వల్లో కి వెళుతున్న, పట్టించుకోని “సిరిసిల్ల పురపాలక కమిషనర్’
నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో! గత రెండు సంవత్సరాలలో వర్షాకాలం లో జరిగిన తప్పిదాలు తిరిగి పునరావృతం కాకుండా సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్, చైర్పర్సన్ లు పట్టణo లోని ప్రధాన మురికి కాల్వ లలోని షీల్ట్ తీయడానికి నిధులు కేటాయించి,తీసిన షీల్ట్ ను అక్కడే వేశారు. ఇలా తీసి రోజులు గడుస్తున్నా, షీల్ట్ ను తొలగించుకపోవడం వల్ల, వర్షాలు కురుస్తుందటంతో తిరిగి షీల్ట్ మురికి కాల్వ లలో కి వెళుతుంది.ఇదిలా ఉండగా కమిషన్లు వచ్చే పనులను పూర్తి స్థాయిలో చేస్తున్న ‘సిరిసిల్ల పురపాలక’? కమిషన్లు లేవనేమో ఈ షీల్ట్ ను ఇలా తీసి, ఎత్తకుండా వదిలేసారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇకనైనా ‘సిరిసిల్ల మున్సిపల్ ‘కమిషనర్,చైర్ పర్సన్లు స్పందించి పట్టణంలో వివిధ వార్డ్ లలో తీసి వదిలిసిన షీల్ట్ ఎత్తి శుభ్రం చేయాలనీ ప్రజలు కోరుతున్నారు.











Leave a Reply