జనవరి 06/26 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్ల మున్సిపల్ కమీషనర్ రూపొందించిన ఓటర్ల జాబితలో తప్పులు ఉన్నాయని, తప్పులను సరిచేయడానికి సమయం పొడగించి సరి చేయాలనీ మాల మహానాడు జాతీయ నాయకుడు రాగుల రాములు అన్నారు.సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాములు మాట్లాడుతూ,సిరిసిల్ల మున్సిపల్ అధికారులు రూపొందించిన ఓటర్ల జాబితాలో పేర్లు, తల్లిదండ్రుల పేర్లు, చిరునామాల తప్పులు అనేకం ఉన్నాయని అన్నారు.పట్టణంలో ఉన్న కొంత మంది ఓటర్లకు వారి సొంత గ్రామాలలో ఓట్లు ఉన్నాయని, వాటిని అధికారులు గుర్తించి తొలగించాల్సిన అవసరముందని పేర్కొన్నారు.మరికొంత మంది ఈ సందర్భాన్ని అనుకూలంగా మలుచుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నారు.తప్పులు సరిచేసుకోవడానికి కమీషనర్ విధించిన గడువు ఈ నెల 10 వరకే నని, ఈ సమయం సరిపోదని,పై అధికారులకు నివేదించైనా సమయం తీసుకొని తప్పులని సరిచేయాలనీ రాములు డిమాండ్ చేశారు.











Leave a Reply