జనవరి 05/26 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
తన ఉనికి చాటుకోవడానికే తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవితక్క జనం బాట పట్టారని తెలంగాణ జాగృతి బాధితుల ఐక్యవేదిక భాద్యులు అన్నారు.సోమవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ,కవితక్క! తన కోసం పాటుపడిన కార్యకర్తలను గడిచిన 10ఏళ్ల లో ఏనాడు పట్టించుకోలేదన్నారు.BRS పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను ప్రశ్నించకుండా, కేవలం తన ఉనికి చాటుకోవడానికే జనం బాట పట్టారని విమర్శించారు.జిల్లా పర్యటనకు వచ్చే సందర్భంలో ఎక్కడ ఆదరణ లభించకపోవడంతో డబ్బులు పంచి, జనాలను కూడగట్టుకుంటున్నారని ఏద్దేవా చేశారు. సాహితీవేత్తలు,మేధావులు కళాకారులు, బడుగు బలహీన వర్గాలప్రజలెవ్వరు కవితక్క కావాలని కోరుకోవడం లేదని తెలిపారు.గుడిలో భక్తులతో, హాస్పిటల్ లోని రోగులతో, స్కూల్లోకి వెళితే విద్యార్థులతో ఇలా జనాలు ఎక్కువ ఉన్న చోట సమావేశాలు పెట్టడమే తప్ప ప్రజాదరణ కాదన్నారు.BRS అధికారంలో ఉన్నప్పుడు నేరెళ్ల బాధితులను పరామర్శించలేదని, ఏనాడూ సిరిసిల్ల బీడీ కార్మికులకు పెన్షన్ విషయం గూర్చి మాట్లాడలేదని,ఖమ్మం జిల్లా చింతపల్లి మండలంలో మరియమ్మ లాక్ అప్ డెత్ , ఎల్బీనగర్ లో లక్ష్మీ అనే మహిళను పోలీసులు విచక్షణారహితంగా కొట్టినప్పుడు, గ్రూప్ వన్ అభ్యర్థిని చనిపోయినప్పడు, వరంగల్ విద్యార్థిని మరణించినప్పుడు ఎప్పుడు కనీసం పరామర్శించని కవితక్క ఇప్పుడు ఎందుకు జనం బాట పట్టారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.కల్వకుంట్ల కుటుంబాన్ని, BRS నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితి లో లేరని పేర్కొన్నారు.











Leave a Reply