ఏప్రిల్ 17/26 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
మాదిగలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఉందని ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షులు కానాపురం లక్ష్మన్ మాదిగ అన్నారు. శుక్రవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో లక్ష్మణ్ మాదిగ మాట్లాడుతూ,రాష్ట్ర జనాభాలో మాదిగలు 10 నుండి 11 శాతం ఉంటారని మా నాయకుడు మందకృష్ణ మాదిగ మొదటి నుండి చెబుతున్నారని,అది కులగణన సర్వే తో స్పష్టమైoదని తెలిపారు.కుల గణన ఇంకా పూర్తిస్థాయిలో శాస్త్రీయంగా జరగలేదని,అలా జరిగితే మాదిగల జనాభా ఇంకా రెట్టింపు అవుతుందని పేర్కొన్నారు.కొంతమంది మేధావుల ముసుగులో జాతికి అన్యాయం చేసే విధంగా కేటాయించిన 9 శాతం రిజర్వేషన్లను స్వాగతించారని,వారు జాతికి ద్రోహం చేశారన్నది రుజువైందన్నారు. పాలకులకు మెప్పుకోసం జాతికి అన్యాయం చేసే విధంగా వ్యవహరించిన ద్రోహులకు జాతిలో స్థానం ఉండదని ఉద్ఘటించారు.ఈ సమావేశంలో ఆవునూరు ప్రభాకర్ మాదిగ, ఎలగందుల బిక్షపతి మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ ఎంఎస్పి జిల్లా అధికార ప్రతినిధి గుండ్రెడ్డి రాజు మాదిగ,శ్రావణ పెళ్లి బాలయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు తంగళ్ళపల్లి దయ్యాల నారాయణ మాదిగ, మండల అధ్యక్షులు రుద్రంగి కర్రే శంకరయ్య మాదిగ, మండల అధ్యక్షులు కొమ్ము రాజశేఖర్ మాదిగ, మండల అధ్యక్షులు సామల ప్రతాప్ మాదిగ, జిల్లా నాయకులు మల్యాల లక్ష్మణ్ మాదిగ, మునిగే శంకర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply