


*జిల్లాలోని దళితుల సమీకరణకు, వారి వెతలను వెల్లడించుకోవడానికి వేదికగా ఉండే జయంతి కార్యక్రమం.
*ఊరేగింపులు, డప్పు చప్పులతో అంబరానంటే సంబరం నాడు
*చలి చప్పుడు లేకుండా సమాప్తం చేస్తున్న సందర్భం నేడు.
* అంబేద్కర్ వాదులు అస్తిత్వం కోల్పోతున్నారా…?
* రాజకీయ పార్టీల ప్రలోభాలే కారణమని భావిస్తున్న “నేటి భారతం’.
ఏప్రిల్ 14/26 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
ఏప్రిల్ 14 మంగళవారo రోజున సిరిసిల్ల పట్టణం నడిబొడ్డున జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవం కళ తప్పుతోందా…….తప్పిస్తున్నారా….? అనే భావన డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ 135 వ జయంతి ఉత్సవాన్ని చూసిన ప్రతి ఒక్కరు అనుకుంటున్న మాటలివి. గత టిఆర్ఎస్ పాలనకు ముందు అంబేద్కర్ జయంతి అంటే పక్షం రోజుల మహనీయుల పండగల జరుపుకునే వారు దళితులు. అంబేద్కర్ జయంతి ఉత్సవానికి వారం రోజుల ముందు నుండే జిల్లా లోని 13 మండలాలలోని దళిత నాయకులు, దళిత ప్రజానీకంతో జిల్లా దళిత సంఘాల నాయకులు సమావేశాలను నిర్వహించి అంబేద్కర్ జయంతి ఉత్సవాన్ని విజయప్రదం అయ్యే విధంగా ప్రణాళికలు రూపొందించుకునేవారు. 13 మండలాల నుండి వచ్చిన దళిత నాయకులు, దళిత ప్రజానీకంతో, డప్పు చప్పుల మధ్య భారీ ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి, వేదిక పై నాయకులు, పోలీస్, రెవెన్యూ వివిధ విభాగాల జిల్లా అధికారులతో, సభా ప్రాంగణంలో ప్రజలు, దళిత ప్రజానీకం, అభిమానులతో నిండిపోయేది. వేదికపై జిల్లా అధికారులు, నాయకులు ఉండటo, 13 మండలాల నుండి వచ్చిన దళితులు, వారికి ప్రభుత్వ కార్యాలయాల్లో ఎదురైన సమస్యలు ప్రభుత్వ అధికారుల తీరును, వేదికపైనున్న అధికారులతో నేరుగా చెప్పుకుని సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఉంటుండేది. అది కాక దళితుల ఉనికిని, వారి ఐక్యతను చాటుకోవడానికి అవకాశం ఉంటుండేది నాడు.
BRS ప్రభుత్వ పాలన నుండి బీటలు….?
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు జరిగి, టిఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రమైన సిరిసిల్లలో అంబేద్కర్ జయంతి ఉత్సవo బీటలువారింది. దళితులు,బహుజనులు ఆత్మగౌరవంతో మా నాయకుడు, జాతీయ నాయకుని జయంతి పండగని సంబరంగా జరుపుకునే ఉత్సవంలో రాజకీయ నాయకుల జోక్యంతో అంబేద్కర్ జయంతి ఉత్సవం అధికారుల చేతుల్లోకి వచ్చింది. అప్పటినుండి అంబేద్కర్ జయంతి ఉత్సవం రోజురోజుకు కళ తపుతూ వస్తుంది. ప్రచార లోపమో,అధికారుల వైఫల్యమో, ఉత్సవంలో దళిత నాయకులను భాగస్వామ్యం చేయలేకపోవడం కారణం ఏదైనా అంబేద్కర్ జయంతి ఉత్సవం పండగ వాతావరణం కోల్పోయిందని చెప్పడానికి నేడు జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవ కార్యక్రమే సాక్ష్యం. ఉత్సవ నిర్వహణలో విభేదాలు వస్తున్నాయంటూ, అందుకే ఉత్సవ కార్యక్రమాన్ని అధికారులకు అప్పజెప్పామంటూ, కారణం చూపుతూ చేతులు దులుపుకునే రాజకీయ నాయకులు గతంలో ఇలాంటి విభేదాలు ఎందుకు ఏర్పడలేదో ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని నేటిభారతం భావిస్తోంది.











Leave a Reply