ఏప్రిల్ 15/26 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
భారత రాష్ట్ర సమితి(BRS )విద్యార్థి విభాగం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజ్జెల దేవరాజ్ కు తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో “దళిత రత్న అవార్డ్’ ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతిన అందజేసింది.తెలంగాణ రాష్ట్ర సాధన,దళితుల సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటం చేసిన గజ్జెల సేవలను గుర్తించి ప్రభుత్వం ఈ అవార్డ్ అందజేసింది.గత BRS ప్రభుత్వం హయాంలో కూడా 2సార్లు దళిత రత్న అవార్డ్ అందుకున్న గజ్జెల దేవరాజ్, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఈ అవార్డ్ తీసుకోవడం తో 3 సార్లు ఈ అవార్డ్ పొందిన దళిత నాయకుడుగా గజ్జెల దేవరాజు నిలిచాడు.దళిత రత్న అవార్డ్ పొందిన గజ్జెల దేవరాజును జిల్లా దళిత సంఘాల నాయకులు అభినందించారు.











Leave a Reply