

ఏప్రిల్ 13/26 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
పర్యావరణ సమతుల్యం కోసం ప్రభుత్వం నాటిన మొక్కలు నరకడానికేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల పరిధిలోని, పోతిరెడ్డి పల్లె గ్రామపంచాయతీలో ప్రభుత్వం హరితహారం కార్యక్రమం ద్వారా నాటిన మొక్కలను కొందరు దుండగులు నరికేశారు. ఈ మొక్కలను గ్రామపంచాయతీ ఉపాధి హామీ పథకం ద్వారా ట్యాంకర్లతో నీరును పోస్తూ పెంచి పెద్ద చేసింది.కానీ కొందరు సొమ్ము చేసుకోవడానికి చెట్లను నరకారని వినిపిస్తుంది.ఇదిలా ఉండగా గ్రామ సర్పంచ్ కు ఈ విషయం తెలియకపోవడం, నరికిన చెట్లు కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.ఫారెస్ట్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలా దుండగలు పోతిరెడ్డి పల్లెలో అడవులను నరికేస్తున్నారని తెలుస్తుంది. ఈ విషయంలో సంబంధిత గ్రామ సర్పంచ్, ఫారెస్ట్ అధికారులు స్పందిస్తారో లేదో చూడాలి.











Leave a Reply