న్యూ ఇయర్ వేడుకల్లో న్యూసెన్స్ చేస్తే కఠిన చర్యలు.

Published by

on

డిసెంబర్ 31/25 : నేటి భారతం.

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

న్యూ ఇయర్ వేడుకల్లో న్యూసెన్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ  మహేష్ బి.గితే  తెలిపారు.బుధవారం జిల్లా ఎస్పీ కార్యలయంలో మాట్లాడుతూ,ఆనందోత్సాహాల మధ్య న్యూ ఇయర్ వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలని,నిర్లక్ష్యం వల్ల విషాధంగా మరకూడదని సూచించారు.డిసెంబర్ 31న జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలున్నాటాయని,మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్ , బైక్ రేసింగ్, త్రిబుల్ రైడింగ్, సైలెన్సర్ తొలగించి వాహనాలు నడుపుతే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు.డీజేలు, అధిక శబ్ద పరికరాలపై పూర్తి నిషేధం  ఉందని, ఉల్లంఘిస్తే కేసులు తప్పవని స్పష్టం చేశారు. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే,వాహనాల యజమానులపై, తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.న్యూ ఇయర్ వేడుకల పేరుతో ప్రజా భద్రతకు భంగం కలిగిస్తే బాద్యులపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారు.2026 సంవత్సరంలో ప్రజలందరికి మంచి కలగాలని ఆశిస్తూ , జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

December 2025
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading