పేరుకే ప్లాస్టిక్ నియంత్రణ….!

Published by

on

●పనులన్ని ప్లాస్టిక్ తోనే.?

● ధర్జాగా  ప్లాస్టిక్ విక్రయిస్తున్న దుకాణదారులు.

●విచ్చలవిడిగా ప్లాస్టిక్ గ్లాసులు,

కవర్ల వినియోగితున్న ప్రజలు.

● తనిఖీలు మరిచిన అధికారులు

● భవిష్యత్ తరాలకు ముప్పని తెలిసిన అధికారుల అవగాహన రాహిత్యమా…? ఉదాసీనతనా…?

డిసెంబర్ 29/25 : నేటి భారతం.

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పేరుకే ప్లాస్టిక్ నియంత్రణ, కాని పనులన్ని ప్లాస్టిక్ తోనే జరుగుతున్నాయి.ఎవరు చెప్పిన, ఆదేశించకపోయినా తుచా తప్పకుండ చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే.జిల్లాలో  కలెక్టర్లు మారిన, అధికారులు మారిన గడిచిన 6ఏళ్ళలో  ఏ MLA, MP, కలెక్టర్లు, కమీషనర్లు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్లాస్టిక్ నిషేదా చట్టాన్ని అమలు చేయలేదు సరి కదా! కనీసం ప్లాస్టిక్ వాడితే అధికారులు ఫైన్ వేస్తారనే భయాన్ని ప్రజల్లో కలిగించ లేదు.ప్రస్తుతం ఉన్న అధికారులు కలెక్టర్ మీటింగులంటూ, బిల్లులు, సర్టిఫికెట్ల పై సంతకాలంటూ ఆఫీస్లకే పరిమితమౌతున్నారు తప్ప, క్షేత్ర స్థాయిలో ఎన్నడు ప్లాస్టిక్ వినియిగదారుల పై చర్యలు తీసుకోలేదు.ప్లాస్టిక్ పై నిషేధం లేని రోజుల్లోనే సిరిసిల్ల పట్టణ పరిధిలో ప్లాస్టిక్  వినియోగాన్ని పూర్తిగా నియంత్రించారు నాటి మున్సిపల్ కమీషనర్లు సుమన్ రావు, రమణ చారీలు.వారికి సాధ్యమైన పని ఇప్పుడున్న కమీషనర్లు కు ఎందుకు సాధ్యం కావడం లేదని  పర్యావరణ ప్రేమికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటించి ప్లాస్టిక్ నియంత్రన చేయాల్సిన అవసరం ఉందని, లేని పక్షంలో చట్టాల పట్ల ప్రజలు విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉందని రాజకీయ వేత్తలు సూచిస్తున్నారు.

Leave a Reply

December 2025
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading