

డిసెంబర్ 24/25 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
ఉద్యోగుల, ఉపాధ్యాయుల ఓట్లతో గెలిచిన MLC లు ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పట్ల స్పందించి, రిటైర్మెంట్ ఉద్యోగుల సమస్యలు పరిస్కరించని పక్షంలో వారి ఇళ్ల ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు పురుషోత్తం అన్నారు.తెలంగాణ ప్రభుత్వ పెన్షన్ దారుల సంయుక్త కార్యచరణ సమితి పిలుపు మేరకు సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు సిరిసిల్ల జిల్లాలోని పెన్షన్ దారులు ఈ రోజు ఒక్కరోజు నిరాహార దీక్ష నిర్వహించారు.ఈ సందర్బంగా పురుషోత్తం మాట్లాడుతూ,ఈ కుబేర్ లో ఉన్న పెన్షన్ల బకాయిలను వడ్డీతో సహా సెపరేట్ గా చెల్లించాలన్నారు.పిఆర్సి 20 20 బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించవలసిన గ్రాట్యూటీ, జిపిఎఫ్ డబ్బులను వడ్డితో సహా వెంటనే చెల్లించాలన్నారు. 2024 మార్చి నుండి రిటైర్డ్ అయిన ఉద్యోగుల GIS, TSGLI బకాయిలు, డి ఏలను వెంటనే చెల్లించాలని కోరారు. CM రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలనని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలోTPTF జిల్లా అధ్యక్షులు రామనాథ్ రెడ్డి,Sc,ST టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పిట్టల దేవరాజు,అజయ్, TPUS ప్రధాన కార్యదర్శి జయకృష్ణ, DTF జిల్లా అధ్యక్షులు సుధాకర్ రెడ్డి,SGTU అధ్యక్షులు వాసలా హరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.











Leave a Reply