
• అధికారులను అడగండoటున్న వార్డు కౌన్సిలర్.
• పిర్యాదు అందితేనే స్పందిస్తామానేలా ఉన్న టౌన్ ప్లానింగ్ అధికారులు.
• వార్డ్ లో వార్డ్ ఆఫీసర్లు చేస్తున్నదేమిటి…?
ఏప్రిల్ 9/26 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
సిరిసిల్ల మున్సిపల్ పట్టణ పరిధిలో అర్ధరాత్రి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. వివరాల్లోకి వెళ్ళితే సిరిసిల్ల మున్సిపల్ 26 వార్డ్ లో రాత్రికి రాత్రే అక్రమానిర్మాణాలు నిర్మిస్తున్నారు. అక్రమాలను అడ్డుకోవాల్సిన కౌన్సిలర్, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులను అడగండని ప్రశ్నించే వారికి ఉచిత సలహా ఇస్తున్నారట.ప్రజలు, ప్రజా ప్రతినిధులు అక్రమాలను ప్రోత్సహిస్తున్నట్లు ప్రవర్తిస్తే, ప్రభుత్వ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. కానీ 26 వార్డులో, వార్డ్ ఆఫీసర్ తనకేం తెలియదు అన్నట్లుగా ప్రవర్తించడం ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది. ఇలా అర్ధరాత్రి అక్రమ నిర్మాణాల వల్ల ఒక కొత్త సoస్కృతికి బీజం వేసినట్లు కనిపిస్తోంది. ఇప్పటికైనా సదరు వార్డు కౌన్సిలర్, వార్డ్ ఆఫీసర్, టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాలపై వెంటనే చర్యలు చేపట్టకపోతే ప్రజల్లో అధికారుల పట్ల విశ్వాసం సన్నగిలే అవకాశం ఉంది. మరి కౌన్సిలర్ ఎలా స్పందిస్తారో చూడాలి.










Leave a Reply