అభివృద్ధి… ఐదేళ్లేనా…?

Published by

on

జులై 04/26 : నేటి భారతం.

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

ఒకప్పుడు అభివృద్ధి అంటే  ప్రజా సంక్షేమం కొరకు నిర్మించిన కట్టడాలు, పనులు పదికాలాలపాటు ప్రజల అవసరాలు తీర్చేవి. నేడు నాయకుల అవినీతి, బంధుప్రీతి కమిషన్ల కక్కుర్తి వల్ల అభివృద్ధి 5 ఏళ్లకే పరిమితమైపోతుందని చూపడానికి ఉదాహరణ శ్రీనగర్ కాలనీలోని 60ఫిట్ల సీసీ రోడ్డు.ప్రజా ప్రతినిధులకు ప్రజలు రాజ్యాంగ బద్ధమైన అధికారాన్ని అప్పగించేది, ప్రజా సంక్షేమం, అభివృద్ధి, ప్రజా ధనం వృధా కాకుండా చూడటం కొరకు.కానీ సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్లోని కొంత మంది కౌన్సిలర్లు కమీషన్లే లక్ష్యంగా ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని  ఆరోపనలు వినిపిస్తున్నాయి.

ప్రజా ధనం వృధా…..?

సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్ పక్కనే ఉన్న శ్రీనగర్ కాలనికి వెళ్ళడానికి,అప్పటి, ఇప్పటి మున్సిపల్ ఛైర్పర్సన్ జిందం కళ సారద్యంలోని గత పాలక వర్గం,కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ మడుపు శ్రీదేవి ఇంటి నుండి శ్రీనగర్ కాలనీకి 60 ఫిట్ల సి సి  రోడ్డును నిర్మించడానికి 6.9కోట్ల నిధులు మంజూరికి ఆమోదం తెలిపి,2 కోట్లను ఖర్చు చేసి 4 వందల మీటర్ల సి సి రోడ్డు నిర్మాణం చేసింది.కనీసం 30ఏళ్ళ పాటు ఉండాల్సిన ఈ రోడ్డు 5ఏళ్ల కే రిపేర్ కు గురైంది.గత కౌన్సిలర్ రాపెల్లి దేనేష్ తన వార్డ్ పరిధిలోని ప్రజలకు సి సి రోడ్డు నిర్మించినా, అది 5ఏళ్లకే పాడవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.ఇప్పుడు ఈ రోడ్డు కు మరమ్మతులు చేయాలన్న మళ్ళీ ప్రజా ధనాన్ని ఖర్చు చేయాల్సిందే. మరి నాణ్యత లోపం వల్ల పాడైన రోడ్డుకు ఎవరు మరమ్మతులు చేయాలి…? గత మున్సిపల్ కౌన్సిలరా…? లేక నాసిరకం రోడ్డు వేసిన కాంట్రాక్టరా…?అడగాల్సిన బాధ్యత ఛైర్పర్సందే. ఇకనైనా అభివృద్ధి పనులకు  కౌన్సిల్లో తీర్మాణాలు చేసి పాస్…పాస్ అంటే సరిపోదని, అ పనులు ప్రజలకు పదికాలాల పాటు ఉపయోగపడేలా చూడాలని, నాణ్యమైన, ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్ల పై చర్యలు చేపట్టాలని “నేటిభారతం’ ఉద్గటిస్తోంది. మరి ఇకముందు చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారో చూడాలి.

Leave a Reply

July 2026
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading