*ముడుపులు ముడితే చాలు విచారణ లేకుండానే సర్టిఫికెట్లు….!
*సిరిసిల్ల పట్టణంలో ఈడబ్ల్యూఎస్ (EWS) సర్టిఫికెట్లు పొందిన ధనవంతులు, వ్యాపారులు.
*సిరిసిల్ల రెవెన్యూ అధికారుల లీలలు…?
*విచారణ చేపడితే అసలు విషయాలు వెలుగులోకి….?
జులై 30/26 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కల్పించి వారి అభ్యున్నతి సాధించడానికి రూపొందించిందే ఈడబ్ల్యూఎస్ (EWS) రిజర్వేషన్లు. అత్యున్నత లక్ష్యం కొరకు ప్రభుత్వ రూపొందించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలు కొంతమంది అవినీతి రెవెన్యూ అధికారుల వల్ల , అగ్రవర్ణాల పేదలకు కాకుండా ధనికులకు లాభాలను చేకూరుస్తుంది. ఈ డబ్ల్యూ సర్టిఫికెట్ జారీ చేసే క్రమంలో రెవెన్యూ అధికారులు, ప్రభుత్వం రూపొందించిన నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ విచారణ చేపట్టి సర్టిఫికెట్లను జారీ చేయాలి. కాని సిరిసిల్ల రెవెన్యూ కార్యాలయం నుండి జారీ చేసిన ఈ డబ్ల్యూ ఎస్ (EWS) సర్టిఫికెట్లు చాలామంది ధనికులు, వ్యాపారులు సంవత్సరానికి 8 లక్షల ఆదాయం మించిన వారు పొందినట్లు పక్కా సమాచారం. ఈ సర్టిఫికెట్లను సదరు వ్యాపారులు ధనవంతులకు జారీ చేసే సమయంలో విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ అధికారులకు భారీగానే ముడుపులు అందినట్లు తెలుస్తుంది. నెల నెల ఒకటో తారీకు లక్షల్లో జీతం పొందుతున్న వీరు, లంచాలకు ఆశపడి విధులను నిర్లక్ష్యం చేయడం వల్ల అసలైన అగ్రవర్ణాల పేదలకు అన్యాయం జరుగుతుందని “నేటి భారతం”ఉద్గటిస్తోంది. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపితే, సిరిసిల్ల రెవెన్యూ అధికారుల అసలు రంగు బయటపడుతుంది. మరి జిల్లా కలెక్టర్ విచారణ జరుగుతారా…? లేదా చూడాలి.











Leave a Reply