దారి తప్పుతున్న ‘నాలుగో సింహం’

Published by

on

*చట్టాన్ని స్వార్ధానికి వాడుకుంటున్న నాలుగో సింహం.

* ప్రజల్లో ఉన్న భయాన్ని ఆసరాగా చేసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్న కొంత మంది పోలీసులు.

*ఇలాగైతే రాను రాను పోలీసుల పట్ల ప్రజల్లో విశ్వాసం తగ్గుతుందంటున్న విశ్లేషకులు.

* పారదర్శకత, జవాబుదారుతనమే పరిష్కారమంటున్న నిపుణులు.

ఆగస్టు 3/26 : నేటి భారతం.

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

తెలంగాణ రాష్ట్రంలో అంత ఫ్రెండ్లీ పోలీస్ అంటున్న, ప్రజల్లో పోలీసుల పట్ల ఉన్న భయాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది పోలీసులు చట్టాన్ని స్వార్థానికి వాడుకుంటూ, పోలీస్ కీర్తికి  మచ్చ తెస్తున్నారు. వరంగల్లో ఇంట్లో గృహ హింస జరుగుతుందని, పోలీస్ స్టేషన్ కు వెళితే,  ఆ మహిళ పరిస్థితిని ఆసరాగా తీసుకొని లైంగిక వేధింపులకు గురి చేసిన ఎస్ఐ ఒకరు,కరీంనగర్ జిల్లాలో భూతగాదాల్లో తన స్నేహితునికి సాయం  చేయడానికి చట్టాన్ని తన సొంతానికి వాడుకుంటూ, స్నేహితుని ప్రత్యర్థిని కేసులో ఇరికించడానికి, అతని ఇంట్లో గంజాయి దాచి తానే అడ్డంగా చట్టానికి దొరికిపోయిన పోలీస్ కానిస్టేబుల్ మరొకరు. రాజన్న సిరిసిల్ల జిల్లా లో ఓ రైతు, తన పొలం చుట్టూ ఉన్న హద్దును చెరిపేస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తున్న కొంతమందిపై ఫిర్యాదు చేస్తే, ఎస్ఐ స్పందించకపోగా, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయగా,ఎస్పీ సూచన మేరకు  సదరు ఎస్ఐ వద్దకు కేసు పంపితే,కనీస విచారణ చేయకుండా ఈ కేసు సివిల్ నేచర్ కలిగి ఉందని మూసివేస్తూ, లోకల్ నాయకులకు వంతపాడిన మరొక పోలీస్. ఇలా పోలీస్ శాఖలో కొంతమంది పోలీసులు, చట్టాన్ని వారి స్వార్థానికి వాడుకుంటూ, పోలీస్ శాఖకు చెరపని మచ్చ తీసుకొస్తున్నారు. క్రమశిక్షణకే మారుపేరైన పోలీస్ శాఖలో  ఇలాంటి అవినీతి  పోలీసులను ఉదాసీనంగా వదిలేస్తే , రానున్న రోజుల్లో పోలీస్ శాఖ పై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లె  ప్రమాదం ఉందని “నేటి భారతం’ అభిప్రాయపడుతోంది. ఇకనైనా సిరిసిల్ల జిల్లా పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లో చట్టాన్ని వారి స్వార్థానికి వాడుకుంటున్న పోలీసులపై నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Leave a Reply

August 2026
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading