“విక్రమ్ “-1 ఇంజనీర్లకు ఘన స్వాగతం.

Published by

on

ఆగస్టు 04/26 : నేటి భారతం.

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన  “విక్రమ్ “-1 ఇంజనీర్లకు ఘన స్వాగతం. లభించింది.గత నెల జూలై మాసంలో శ్రీహరికోట నుండి  గగనతలంలోకి విజయవంతంగా చేరుకున్న “విక్రమ్ “-1 అర్బీటాల్ వాహక ప్రయోగం లో కీలక పాత్ర వహించిన సిరిసిల్ల కు చెందిన యువ ఇంజనీర్లు అడుప సంతోష్ కుమార్, అడుప కిరణ్ , బొమ్మదేని నాగరాజులను శ్రీకృష్ణదేవరాయ, కాకతీయ, వికాస్ విద్యా సంస్థల చైర్మన్ గుగ్గిళ్ళ జగన్ గౌడ్ సాదరంగా ఆహ్వాని , సన్మానించారు. ఈ సందర్భంగా గుగ్గిళ్ల జగన్ గౌడ్ మాట్లాడుతూ, దేశానికే కీర్తి ప్రతిష్టలు తెచ్చిన ప్రయోగంలో , భాగస్వామ్యులైన ఇంజనీర్లు తమ పాఠశాలలో విద్యనభ్యసించిన వారు కావడం గర్వకారణంగా ఉందన్నారు. ఈ యువ ఇంజనీర్లు నేటి యువతకు ఆదర్శమని కొనియాడారు. ప్రతి ఒక విద్యార్థి ఉన్నత లక్ష్యం ఏర్పాటు చేసుకొని, లక్ష్యం వైపు అంకుటిత దీక్షతో ముందుకు సాగాలని, అప్పుడే లక్ష్యం చేరుతామని పేర్కొన్నారు. అనంతరం యువ ఇంజనీర్లు మాట్లాడుతూ క్రమశిక్షణ, అంకితభావం, నిరంతర శ్రమ మనిషి ఏ రంగంలో అయినా రాణించడానికి దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయ, కాకతీయ, వికాస్, విద్యాసంస్థల ఉపాధ్యాయ బృందం, ప్రముఖ న్యాయవాది గే0ట్యాల భూమేష్, విద్యార్థులు, యువ ఇంజనీర్ల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

August 2026
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading