ప్రతిచోట ప్లాస్టిక్… పట్టించుకోని కమిషనర్.

Published by

on

ప్లాస్టిక్ కవర్లతో ప్రజలు

*చర్యలు చేపట్టని శానిటేషన్ అధికారులు.

*పేపర్లో వచ్చినప్పుడే చర్యలు. 

* రమణాచారి హయాంలో క్లీన్ సిటీ.. గా సిరిసిల్ల.

*ఇప్పుదెందుకు ఈ నిర్లక్ష్యం…?

ఆగస్టు 11/26 : నేటి భారతం.

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

కేంద్ర ప్రభుత్వం ప్లాస్టిక్ బ్యాగుల వినియోగాన్ని  పూర్తిగా నిషేధించినప్పటికీ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం విచ్చలవిడిగా జరుగుతుంది. ప్రతిచోట ప్లాస్టిక్ వస్తువులు వాడుతున్న,  సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ పట్టించుకోవడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. గత మున్సిపల్ కమిషనర్ రమణాచారి హయాంలో కేంద్ర ప్రభుత్వం, ప్లాస్టిక్ వస్తువుల నిషేధం విధించనప్పటికీ, సిరిసిల్లను ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దారనీ, ఆయన తర్వాత వచ్చిన కమిషనర్లు ఎవ్వరు ప్లాస్టిక్ వస్తువుల నియంత్రణ పై శ్రద్ధ చూపకపోవడంతో, వ్యాపారులతో అధికారులకు ఏవైనా లావాదేవులు ఉండొచ్చనీ, ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అది కాక వార్త పత్రికలల్లో ప్లాస్టిక్ వస్తువుల వినియోగం పై వార్తలు వచ్చినప్పుడు మాత్రమే, ప్లాస్టిక్ బ్యాగుల షాపులపై తూ తూ మంత్రంగా దాడులు నిర్వహించి, చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టణ పరిశుభ్రత, ప్రజల ఆరోగ్యం పై సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్, పాలకవర్గానికి చిత్తశుద్ధి ఉంటే, ప్రతి ఫిబ్రవరి, మార్చ్,ఏప్రిల్ మాసంలో ఇంటి పనులు వసూలు చేయించడానికి పూర్తిస్థాయి సిబ్బందితో పని చేయించే కమిషనర్ , పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చడానికి ఎందుకు కృషి చేయడం లేదని సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్, పాలకవర్గానికి పట్టణ పరిశుభ్రత, ప్రజల ఆరోగ్యంపై చిత్తశుద్ధి ఉంటే, పట్టణంలో ఎక్కడ ప్లాస్టిక్ కనిపించకుండా చూడాల్సిన బాధ్యత ఉందని “నేటి భారతం”ఉద్గటిస్తోంది. మరి కమిషనర్ స్పందిస్తాడా…?? పాలకవర్గం ప్రజల ఆరోగ్యం కోసం  నడుం బిగిస్తోందా…? వేచి చూడాలి.

Leave a Reply

August 2026
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading