* RBI నిబంధనలను పట్టించుకోని అర్బన్ బ్యాంక్ పాలకవర్గం.
* మైక్రో ఫైనాన్స్ కంపెనీలే వినియోదారులకు ఇన్సూరెన్స్ చేయిస్తుండగా
* సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ మాత్రం ఇన్సూరెన్స్ చేయడం లేదు ఎందుకు…?
*వినియోగదారులకు తెలిపాల్సిన బాధ్యత పాలకవర్గానికి లేదా….?
ఆగస్టు 12/26 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
ఖాతాదారునీ సంక్షేమం కంటే బ్యాంకు లాభాలే ముఖ్యమనెలా వ్యవహరిస్తున్నారు సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ , పాలకవర్గం, అధికారులు. నేటి సమాజంలో ఏ చిన్న లోన్ తీసుకున్న ఆ లోన్ అమౌంట్ కు సరిపడా ఇన్సూరెన్స్ సదుపాయాలు అందజేస్తున్నాయి ఆయా బ్యాంకులు. రుణ గ్రహీతకు అనుకోని ఇబ్బందులు ఎదురైనప్పుడు, అతను, అతని కుటుంబం లోన్ చెల్లించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు, రుణ గ్రహీత అప్పు తెచ్చుకున్న బ్యాంకుకు అప్పు చెల్లిస్తుంది. మైక్రో ఫైనాన్స్లు మొదలుకొని జాతీయ బ్యాంకులన్నీ కూడా ఆర్బిఐ నిబంధనలకు లోబడి ఈ సదుపాయాలను రుణగ్రహితకు అందజేస్తుండగా, సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ మాత్రం, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుంది. సిరిసిల్ల అర్బన్ బ్యాంకు నుండి రుణం, పొందిన రుణ గ్రహీత
అనుకోకుండా మరణిస్తే అతను తీసుకున్న రుణాన్ని మొత్తం అతని కుటుంబ సభ్యుల నుండి రాబడుతుంది. వారున్న పరిస్థితులు పరిస్థితిని పట్టించుకోకుండా రుణం చెల్లించాల్సిందేనని పట్టుబడుతుంది. ఆర్బీఐ నిబంధనలు అమలు చేస్తే రుణం పొందుతున్న రుణగ్రహితకు, అనుకోని ఆపద కలిగినప్పుడు, అతను తీసుకున్న రుణాన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు భరించడం జరుగుతుంది. ఇలా ఖాతాదారు/ వినియోదారునికి లాభం చేకూరేలా వ్యవహరించాల్సిన సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ , మాకే సంబంధం లేదు అనే విధంగా వ్యవహరించడం సోచనీయం. ఇకనైనా రుణ గ్రహీతలకు ఇన్సూరెన్స్ సదుపాయాలు ఇప్పించాలని ఖాతాదారులు డిమాండ్ చేస్తున్నారు. మరి సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ ఖాతాదారుల సంక్షేమం కై పాటుపడుతున్న లేదా చూడాలి.











Leave a Reply