పద్మశాలి ఎన్నికలకు…. పార్టీల రంగు..!

Published by

on

*నాయకుడు జనం నుండి, జనం సమస్యల నుండి ఉద్భవిస్తాడు.

*’నేడు’ రాజకీయ నాయకుల అండదండలలు, ఆశీర్వాదంతో నాయకుడనీ అంటున్నారు…?

*స్వామి భక్తి, భజనవల్ల సామాన్య యువతకు దక్కని నాయకత్వం…?

*సిరిసిల్ల పట్టణంలో రేపు జరిగే ఎన్నికలే రేపటి భవిష్యత్తుకు దిక్చూచి అంటున్న విశ్లేషకులు.

ఆగస్టు 22/26 : నేటి భారతం.

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రేపు(ఆదివారం )జరిగే పద్మశాలి కుల సంఘం ఎన్నికలకు కొంతమంది రాజకీయ పార్టీల రంగు అద్దుతున్నారు. ఆ పార్టీ నాయకుడు గెలిస్తే పట్టణంలో అభివృద్ధి జరుగుతుందంటూ ప్రచారం చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రతి ఎన్నిక ప్రజాస్వామ్య బద్దంగా, ప్రలోభాలు లేకుండా జరగాల్సిన వేళ, కొందరు పార్టీల అండదండలు ఉన్న వ్యక్తిని గెలిపించుకుంటెనే కుల సంఘం అభివృద్ధి జరుగుతుంది, లేదంటే మరో పదేళ్లు వెనకకి వెళ్లాల్సి వస్తుందని ఓటర్లను ప్రభావితం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

ప్రస్తుతం జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఏలాంటి రాజకీయ నేపథ్యం లేనప్పటికీ, కొంతమంది యువత ఉత్సాహంతో, కుల సంఘం అభివృద్ధి పట్ల ప్రణాళికలు రచించుకొని ఎన్నికల్లో నిలుచున్నారు. వారిని ప్రోత్సహించాల్సిన కుల సంఘం పెద్దలు, కేవలం పలుకుబడి, రాజకీయ మద్దతు ఉన్న అభ్యర్థుల కోసమే పనిచేస్తున్నట్లు పట్టణంలో చర్చ జరుగుతోంది.నాయకత్వం, పాలన, అభివృద్ధి, అను అంశాలపై పూర్వీకులు, తత్వవేత్తలు స్పష్టమైన నిర్వచనం ఇచ్చినప్పటికీ, నేటితరం నాయకులు మాత్రం, తత్వవేత్తల భావాలను తోసిపుచ్చుతూ, రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలకు స్వామి భక్తి ప్రకటిస్తూ, భజన చేస్తేనే, రాజకీయమని తద్వారా అభివృద్ధి జరుగుతుందని ప్రత్యక్షంగా తెలపడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి రేపు జరిగే సిరిసిల్ల కుల సంఘం ఎన్నికల్లో జనం నుండి వస్తున్న అభ్యర్థులు గెలుస్తారో, రాజకీయ పార్టీలకు కొమ్ముకాస్తున్న అభ్యర్థులు  గెలుస్తారో వేచి చూడాలి.

Leave a Reply

  1. Good mama

August 2026
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading