• సిరిసిల్లా ఆశోక్ నగర్ లో మహిళ హత్య కేసును చేదించిన పోలిస్ లు.
• నిందితులు ఇద్దరిలో ఒకరు పరారీలో…మరోకరిని రిమాండ్ కు పంపిన పోలిస్ లు.
• సిరిసిల్లా జిల్లాలో ఆథార్ చూపందే అద్దె ఇవ్వోదని తెల్పిన జిల్లా ఎస్పి అఖిల్ మహజన్ .
నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి.
గత నెల మార్చి19న సిరిసిల్లా పట్టణంలోని అనంతనగర్ లో మహిళ హత్య కేస్ ను సిరిసిల్లా పోలిస్ లు చేదించారు. నిందితులు ఇద్దరిలో ఒకరిని బీహార్ లో అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్ కు పంపగా, మరోక నిందితుడు పరారిలో ఉన్న రాజన్న సిరిసిల్లా జిల్లా ఎస్పి రాహుల్ మహజన్ తెలిపారు. జిల్లా ఎస్పి తెలిపిన వివరాల ప్రకారం,బీహార్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు నిందితులు రూడల్ సదా( పరారీలో ఉన్నాడు),
రామ్బ్రిక్స్ సదా(34).ఉపాధి నిమిత్తం రాజన్న సిరిసిల్లా జిల్లాలోని సిరిసిల్లా పట్టణానికి వలస వచ్చారు.పట్టణంలోని అశోక్ నగర్ లో అద్దెకుంటు,కూలీ పనులకెళ్ళెవారు. వీరు పని చేసే చోట కోడిముంజకు చెందిన అలకుంట రమతో పరిచయం పెంచుకున్నారు.అప్పటినుండి ఎలాగైనా రమను అనుభవించాలనే ఉద్దేశంతో పలుమార్లు ప్రయత్నం చేసిన, నిందుతులు అద్దెకుదంటున్న రూం పక్కన మరికొందరు కూలిలు అద్దెకుంటంతో వీలుపడలేదు. వారందరు ఓ రోజు వారి ఊళ్ళకు వెళ్ళిన తరువాత,మార్చి 19 సాయంత్రం రమను వారి రూంకు తీసుకెళ్ళారు. ఒక స్ర్టాంగ్ బీర్ , ఒక మందు బాటిల్ తెచ్చుకొని మద్యం సేవించారు.రమ మత్తులోకి వెళ్ళాగానే రూడాల్ సదా రమను అనుభవించాడు.అనంతరం రామ్బ్రిక్స్ సదా అత్యాచారం చేయబోగా, మత్తు నుండి తెరుకున్న రమ ఎవరికైనా చెబుతుందనే ఉద్దేశంతో రామ్బ్రిక్స్ సదా, రూంలో ఉన్న చిన్న సిలెండర్ తో రమ తల పై మోదడంతో, స్ప్రూహ కోల్పోయిన రమ,మరణించిందో లేదోననే అనుమానంతో రూడల్ సదా తన లుంగితో రమకు ఊపిరాడకుండా చేసి,హత్య చేసి బీహర్ పారిపోయారు. ఈ హత్య సిరిసిల్లా లో సంచనం రేపగా,సిరిసిల్ల పోలీస్ స్టేషన్ టౌన్ లో కేసు నమోదు చేసి డిఎస్పీ ఆధ్వర్యంలో సిరిసిల్ల టౌన్ సి.ఐ రఘుపతి, టాస్క్ఫోర్స్ సి.ఐ ప్రవీణ్ కుమార్, ఎల్లారెడ్డిపేట్ ఎస్.ఐ రమాకాంత్ ,టాస్క్ఫోర్స్ సిబ్బంది తో స్పెషల్ టీం ఏర్పటు చేసి దర్యాప్తు లో భాగంగా నిందితులలో ఒకరైనా రామ్బ్రిక్స్ సదా, ను బీహార్ లో అదుపులోకి తీసుకొని సోమవారం రిమాండ్ కు తరలించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పి మాట్లాడుతూ,పరిచయం లేని వ్యక్తులకు అద్దె ఇవ్వోద్దని, ఇస్తే వారి ఆథార్ ,వివరాలు తీసుకోవాలని సూచించారు. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తే పోలిస్ లకు తెలపాలని కోరారు.











Leave a Reply