నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి.
ప్రస్తుతం రాష్ట్రంలో చేనేత కార్మికులకు గడ్డు పరిస్థితులు నడుస్తున్నాయి.రాజన్న సిరిసిల్లా జిల్లాలోని సిరిసిల్లా లో నెల గడవక ముందే మరో నేత కార్మికుడు ఆత్మహత్య కు పాల్పడ్డాడు.స్థానికులు,బంధువులు తెలిపిన వివరాల ప్రకారం రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ లో సిరిపురం లక్ష్మినారాయణ చేనేత కార్మికుడు.గత రెండు నెలలు నుండి ఉపాధి లేకపోవడంతో కుటుంబ పరిస్థితులు ఇబ్బందికరంగా మారడంతో ,అడిగిన చోట అప్పు దొరకక ,మనఃస్థాపంతో ఈరోజు ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.మృతినికి భార్య వజ్రవ్య,ఇద్దరు పిల్లలు నవీన్ ,వేణు ఉన్నారు. ఆర్థికంగా చితికిపోయిన లక్ష్మినారాయణ కుటుంబాన్ని ఆదుకోని సాయమందించాలని వార్డ్ ప్రజలు కోరుతున్నారు.











Leave a Reply