
నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి.
బావబావమరుదుల కమిషన్ పంపకాలలో బేధాభిప్రాయాలే రైతుల పాలిట శాపంగా మారిందని తంగళ్ళపల్లి మండల కాంగ్రేస్ పార్టి అధ్యక్షులు ప్రవీణ్ జే టోనీ అన్నారు.మంగళవారం మండలంలోని జిల్లెల్ల గ్రామంలోగల 9 వ ప్యాకేజి పనులను పార్టి నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా టోని మాట్లాడుతూ, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావ్,సిరిసిల్ల ఏమ్మెల్యే కేటీఆర్ ల మధ్య, కాల్వల నిర్మాణంలో ఏర్పడిన బేధాభిప్రాయలు రైతుల పాలిట శాపంగా మారినయని ఆరోపించారు.
కేటీఆర్ & కంపెనీ కేవలం కమిషన్ల కోసం కక్కుర్తి పడి, 11 ప్యాకేజీ పనులు ప్రారంభించారని, ప్రారంభించిన పనులు కూడ పూర్తి చేయలేదని ఏద్దేవా చేశారు.కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నమ్మి ప్రజలు,నాయకులు పార్టీలోకి వస్తున్నారని,మీలాగా పోన్లు టాపింగ్ చేసి బెదిరింపులు గురిచేస్తే భయంతో పార్టిలో చేరడం లేదని అగ్రహం వ్యక్తం చేశారు. మీ స్వంత పార్టీ నేతలను నమ్మక పోన్లు ట్యాపింగ్ చేసినా, మీరు కింగ్రెస్ పార్టి పై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.బిఆర్ఎస్ నేతలు నోరు విప్పితే అన్ని అబద్దాలేనని,అందుకే ప్రజలు తిరస్కరించి పక్కకు పెట్టారని దుయ్యబట్టారు. పదవి ఉన్న లేకున్నా ప్రజల్లో ఉంటు, ప్రజా సమస్యలపై పోరాడుతున్న వ్యక్తి కేకే మహేందర్ రెడ్డని, కేకే పై మరోసారి అవాకులు చవాకులు పేలితే సహించేది లేదని హెచ్చరించారు.హరీష్ రావు,కెటిఆర్ రైతుల మధ్య నీళ్ళ పంచాయతీ పెట్టారని,రైతుల కోసమంటూ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి లక్షల కోట్లు దోచుకున్నది మీరు కాదా అని ప్రశ్నించారు.మేదిగడ్డ కుంగిపోయి కూలిపోయే పరిస్థితికి వచ్చిందంటే,అది మీ పనితనానికి నిదర్శనమని పేర్కొన్నారు.ఏ ఒక్క రోజు కూడా రైతులను పరామర్శించని మీరు, ఇప్పుడు దొంగ ఏడ్పులు ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు.అభివృధ్ది మాటునా,ఇసుకను హైదరాబాద్ తరలించి వేల కోట్ల రూపాయలు,బతుకమ్మ చీరాల పెరీట వందల కోట్లు దోపిడీ చేసిన మీకు కాంగ్రెస్ పార్టిని విమర్శించే అర్హత లేదని వివరించారు.ఈ కార్యక్రమంలో ప్రవీణ్ తో పాటు మండల కాంగ్రెస్ నాయకులు,జిల్లెళ్ల గ్రామ కాంగ్రెస్ నాయకులు,గ్రామ రైతులు పాల్గొన్నారు.











Leave a Reply