• వస్త్ర పరిశ్రమ పై 12% జిఏస్టి విధించింది బిజెపి ప్రభుత్వమే..!
• చేనేత,టెక్స్ టైల్ బోర్డును రద్దు చేసింది మోఢీ ప్రభుత్వమే..?
• పవర్ లూమ్ కస్టర్ వరంగల్ కు వెళితే ఎం.పి ఏం చేస్తున్నట్లు….?
• చావు మార్గం కాదు,మేమున్నామని భరోసా ఇచ్చిన మంత్రి పోన్నం.
• సిరిసిల్లా MLA,MP లు నేతకార్మికులను రెచ్చగొడుతున్నారు.
నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి.
బిజెపి,బిఆర్ ఏస్ రెండు పార్టిల ఏమ్మేల్యే,ఎం.పిలు
శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని తెలంగాణ రాష్ట్ర రవాణ, బి.సి సంక్షేమ శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు.సోమవారం సిరిసిల్లా పట్టణంలోని విద్యానగర్ లో గల కాంగ్రెస్ పార్టి కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పోన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, సిరిసిల్ల కేంద్రంగా చేనేత కార్మికులతో బిఆరెస్ ,బీజేపీ పార్టిలు రాజకీయ ఆటలాడుతున్నాయని తెలిపారు.మేము అధికారంలోకి వచ్చి 4 నెలలు మాత్రమే అవుతుందని, గత 10 సంవత్సరాలుగా ఈ రెండు ప్రభుత్వాలు చేనేత కార్మికులకు ఎం చేసాయో చెప్పాలన్నారు.నేతన్నల పేరు మీద బిజెపి,బిఆర్ ఎస్ పార్టీలు శవ రాజకీయాలు చేస్తున్నాయని, వారు చేస్తున్న రాజకీయాన్ని నేతన్నలకు , మీ అందరికీ చెప్పడానికే ఇక్కడికి వచ్చామని పేర్కొన్నారు.స్వతంత్రం అనంతరం నేతన్నల ప్రయోజనం కోసం ఏమైనా చేసిందంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనని స్పష్టం చేశారు.
బీజేపీ ప్రభుత్వం వస్త్ర పరిశ్రమ మీద 12 శాతం జీఎస్టీ విధించడమే కాకుండా,జాతీయ చేనేత బోర్డు,టెక్స్ టైల్ బోర్డును బీజేపీ ప్రభుత్వమే రద్దు చేయడమే కాకుండా, మహాత్మ గాంధీ గుణకర్ భీమా యోజన,icici నాబార్డు ఆరోగ్య భీమా ను రద్దు చేసిందని పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా SIDP పథకం ద్వారా పారిశ్రామిక అభివృద్ధి ప్రమోషన్ల కింద వేల కోట్ల నిధులు చేసిందని,కాని మన అసమర్థ పార్లమెంట్ సభ్యుడు, ఈ నెల 10 నాడు దీక్ష చేయనున్న, ఏం.పి తమిళనాడు కి ఎంత వచ్చాయని, మన రాష్ట్రానికి ఎంత తెచ్చారని ప్రశ్నించారు. 550 కోట్ల బకాయి ఏవరి పాపం, టెక్స్ టైల్ ఇండస్త్రిలో ఉమ్మడి జిల్లాలో సిరిసిల్ల నంబర్ 1,సిరిసిల్ల కు పవర్ లూమ్ కస్టర్ కావాలని మేం అడిగామని,
అప్పుడు కనీసం నోరెత్తని పార్లమెంట్ సభ్యుడు ఏం ముఖం పెట్టుకొని 10 నాడు దీక్ష చేయబోతున్నావని ఏద్దేవా చేశారు. మాకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన ఎవరిపైనైనా కక్ష సాధింపు చర్యలు చెప్పటామా? అని ప్రశ్నించారు.
రాష్ట్ర అప్పులలో బతుకమ్మ చీరలకు సంబంధించినవే 300 కోట్లు, ఆ బకాయిలు ఎందుకు చెల్లించలేదని అన్నారు.అన్ని సహకార సంఘాలలో పని చేసే ప్రతి ఒక్కరికీ పని ఇవ్వాలనే మా ఉద్దేశ్యమని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం” మాకు పని లేదన్న మాట వినబడకుండ పని కల్పిస్తున్నామని, జీఓ నంబర్ 1 ద్వారా రాష్ట్రంలో అన్ని చేనేత సంఘూల నుండి వస్త్రాల కొనుగోలు చేయడానికి జీఓ తీసుకొచ్చామని తెలిపారు. ఈ నాలుగు నెలల కాలంలో 120 కోట్ల ఆర్డర్ సిరిసిల్ల కు ఇచ్చామన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అమరవీరుల పేరు చెప్పి శవాల మీద ప్యాలాలు ఎరుకున్నట్టు వ్యవహరించారని,ఇప్పుడు కూడ నేతన్న మరణాల పేరిట పబ్బం గడిపే పనిలో ఉన్నారని దుయ్యబట్టారు.నేతన్నలకు చావు మార్గం కాదని, ప్రతిపక్ష పార్టీలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని హితవుపలికారు. మేమంతా కలిసి సిరిసిల్ల నేత కార్మికులకు ఒక్క కష్టం కూడా రాకుండా చుస్కుంటామని భరోసా ఇచ్చారు.
వినోద్ కుమార్ ఇక్కడ ప్రజలకు చిప్ప చేతికిచ్చి, అక్కడికి ఇండస్ట్రీ తీసుకుపోయాడని, నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఎం చేశానో చెప్పడానికి సిద్దంగా ఉన్నామని సవాలు చేశారు.
మీరు ఎం చేశారో చెప్పకుండా అక్షింతలు పేరుతో ఓట్లు అడుగుతున్నారని, నరేంద్ర మోడీ పేరు చెప్పి కూడా ఓట్లు అడిగే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు.
నేతన్నలు వీరి ట్రాప్ లో పడవద్దని,.మేము నష్టం చేస్తే మమల్ని నిలదీయండని,మీకు అండగా ఉంటామని హామి ఇచ్చారు. గత10 సంవత్సరాల్లో మేం చేనేత కార్మికుల్ని కలుద్దామంటే ఆ ప్రకటిత కర్ఫ్యూ లా కలవని పరిస్థితి ఉండేదని అసహనం వ్యక్తం చేశారు. పద్మశాలి కార్పోరేషన్ ఏర్పాటు చేశాం,సాంకేతికంగా వృత్తిని అభివృద్ధి చేస్తామని తెలిపారు.నేతన్న గీతన్న వేరు కాదన్నారు. సిరిసిల్ల నేతన్నలకు ఏ ఇబ్బంది ఉన్న, మాదృష్టికి తీసుకురావాలని కోరారు.అధికారులకు సైతం ఈ సమావేశం ద్వారా తెలియజేస్తున్నానని ,విద్యుత్ బకాయిలున్న ఇబ్బంది పెట్టవోద్దని తెలిపారు. మహిళలకు వడ్డీలేని రుణాలు ఇచ్చామని,మా ప్రభుత్వం అంత్యోదయ కార్డులు ఇస్తే, బిఆర్ ఎస్ తొలగించిందని గుర్తుచేశారు.రాష్ట్రం మొత్తం 12 వేల అంత్యోదయ కార్డు ఉంటే ఒక సిరిసిల్ల లోనే 12 వేల కార్డ్స్ ఉన్నాయని,వాటిని తొలగించింది మీరు కాదా అని ప్రశ్నించారు. శవాల మీద రాజకీయాలు చేయకండని హెచ్చరించారు.ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ , కే.కే మహేందర్ రెడ్డి,చొప్పదండి ప్రకాశ్ , నాగుల సత్యనారాయణ, సంగీతం శ్రీనివాస్ , ఆకునూరి బాలరాజు, సూర దేవరాజు, కాముని వనిత,వేల్ముల స్వరూప,నళిని కాంత్ ,తిరుపతీ రెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.











Leave a Reply