• పిట్టల భూమేశ్ సినియర్ న్యాయవాది.
నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి.
రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ తోనే సాధ్యమని బిఎస్పి మాజీ రాష్ట్ర కార్యదర్శి పిట్టల భూమేష్ అన్నారు.మంగళవారం సిరిసిల్లా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,గత నెలలో తామందరం బిఏస్పి పార్టికి రాజీనామ చేయడం అందరికి తెలిసిందేనన్నారు.భవిష్యత్ కార్యచరణలో భాగంగా, ప్రజల విశ్వాసం చూరగొన్న పార్టిలో ,ప్రజలకు సేవలందించాలని భావిచామని తెలిపారు.పలు పార్టిల పెద్దలు వారి పార్టిలోకి ఆహ్వనించినా, భారత రాజ్యాంగం విలువలకు కట్టుబడి పని చేస్తున్న పార్టిలోకి వెళ్ళాలని భావించామన్నారు.నేడు రాజ్యంగం ప్రమాదంలో ఉందన్నారు. బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తుందని పేర్కొన్నారు.దేశంలో ఆర్టికల్ 14,15,16,17 ప్రశ్నార్థకంగా మారిందన్నారు.
బిజేపి ప్రభుత్వంలో మనిషి జీవించే హక్కు కూడ హరించి వేయబడుతుందని అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టితోనే రాజ్యాంగ విలువలు రక్షించబడతాయని భావిస్తూ,మేం కాంగ్రెస్ పార్టి లో చేరబోతున్నామని ప్రకటించారు.ఇన్నాళ్ళు మాతో పని చేసిన స్నేహితులు,ప్రజలకు,నాయకులకు,కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.ఈ సమావేశంలో ,లింగంపెల్లి మధూకర్ ,సామల వెంకటేశం,తదితరులు పాల్గొన్నారు.











Leave a Reply