మైనర్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు!

Published by

on

మైనర్ త్రిబుల్ రైడింగ్  చేస్తున్న బాలుర వాహన తాళాలను  స్వాధీనం చేసుకుంటున్న ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది 

నేటి భారతం(ప్రశ్నించడం పరిష్కారం):

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

మైనర్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని రాజన్న సిరిసిల్ల జిల్లా ట్రాఫిక్ ఎస్ ఐ రమేష్ తెలిపారు. మంగళ వారం సిరిసిల్ల గాంధీచౌక్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై రమేష్ మాట్లాడుతూ,  జిల్లాలో మైనర్ డ్రైవింగ్ రోజురోజుకు పెరిగిపోతుందని, తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇవ్వద్దని తెలిపారు.  ఎవరైనా మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే, కఠిన చర్యలు తప్పవని సూచించారు.  మైనర్లు నడిపిన ఆ వాహనాల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలకు లోబడి నెంబర్ ప్లేట్, సైలెన్సర్, లైసెన్స్ తదితరాలు లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని తెలిపారు.  తల్లిదండ్రులు మైనర్ పిల్లలకి వాహనాలు ఇవ్వద్దని కోరారు.

Leave a Reply

June 2024
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading