* TPTF రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ పిలుపు.
నేటి భారతం( ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
గజ్వెల్ లోని మహతి ఆడిటోరియం లో జరిగే టీపీటీఫ్ విద్యా సదస్సును విజయవంతం చేయాలని టీపీటీఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దోర్నాల భూపాల్ రెడ్డి,దుమాల రమానాథ రెడ్డి లు పిలుపు నిచ్చారు. మంగళవారం జిల్లా నాయకులతో కలిసి విద్యా సదస్సు పోస్టర్ ను సిరిసిల్ల పట్టణం లోని శివనగర్ ఉన్నత పాఠశాల లో ఆవిష్కరించారు.ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ! టీపీటీఫ్ అధికార మాస పత్రిక ప్రధాన సంపాదకులు ప్రకాష్ రావు పదవీ విరమణ సందర్భముగా గజ్వేల్ లో ఈనెల 16న (ఆదివారం) విద్యా సదస్సు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మొదటి అంశం:
సంక్షోభంలో సామాజిక విలువలు అంశం పై
వక్త: ప్రొఫెసర్ సి. ఖాసీం, OU హైద్రాబాద్,
2వ అంశం : విద్యారంగ సంక్షోభం – కర్తవ్యాలు అంశం పై వక్త: ఏపీటీఎఫ్ పూర్వ అధ్యక్షులు
ఏ నర్సింహారెడ్డి,లు ఉపన్యసిస్తారని తెలిపారు.
ఈ విద్యా సదస్సుకు జిల్లాలోని ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమం లో సీనియర్ ఉద్యమ నాయకులు
ఏ. రామచంద్రం, GHM మోతీలాల్,జిల్లా ఉపాధ్యక్షులు పురంవాసుదేవరావు,మళ్ళారపు పురుషోత్తం,సత్తు రవీందర్,నాయకులు రాజేందర్,మైలారం తిరుపతి,మహమూద్,లక్ష్మీ నారాయణ,శ్రీనివాస్ రాజు,చంద్ర శేఖర్,రాంబాబు,శ్రీనివాస్,మధుసూదన్, నరేందర్ గజ్వేల్ కౌన్సిలర్, p.ఎల్లయ్య జిల్లా కౌన్సిలర్, మహమూద్ జిల్లా కార్యదర్శి, భాస్కర్ జాగ్దేవపూర్ కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు.











Leave a Reply