సోషల్ మీడియాలో వచ్చే  వదంతులను నమ్మవద్దు.

Published by

on

• రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.

నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం):

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

సోషల్ మీడియాలో వచ్చే ఏలాంటి వదంతులను (పుకార్ల) ప్రజలు నమ్మవద్దని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,సోషల్ మీడియాలో వచ్చే ఏలాంటి వదంతులను నమ్మవద్దని,శాంతియుతంగా పండుగలు జరిగేలా అన్ని వర్గాల ప్రజలు, మత పెద్దలు సహకరించాలని కోరారు.ప్రజలు సోదర భావంతో, శాంతియుత వాతావరణంలో పండుగలను జరుపుకుంటూ, మత సామరస్యానికి ప్రతీకగా నిలవాలన్నారు.సోషల్ మీడియా లో అభ్యంతరకర పోస్టులు వచ్చినా, అ పోస్టులను చూసిన వెంటనే ప్రతిస్పందించకుండా, సంయమనం పాటిస్తు అ పోస్టుల్లో నిజానిజాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలని కోరారు.సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను పోస్ట్ చేసిన ,ఫార్వార్డ్ చేసిన వారితో పాటుగా గ్రూప్ అడ్మిన్లపై చట్టప్రకారం చర్యలు  తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

Leave a Reply

June 2024
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading