• విద్యార్థులంతా ప్రిన్సిపాల్ చెప్పిన బుక్ స్టాల్ లోనే బుక్కులు, పుస్తకాలు కొనాలట..?
• తరాలుగా ఈ తంతు నడుస్తున్న తొంగిచూ డని జిల్లా విద్యాధికారి.
• ప్రతి యేడు అదనంగా వేలకు వేలు సమర్పించుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు.
నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
జూన్ మాసం వచ్చిందంటే చాలు, బుక్ స్టాల్ ల ముందు విద్యార్థుల పుస్తకాలు, నోట్ బుక్ ల కోసం తల్లిదండ్రులు బారులు తీరడం కనిపిస్తుండటం 40 ఏళ్ళు గా సిరిసిల్ల జిల్లా కేంద్రం లో చూస్తున్నాం. విద్యార్థుల పై తల్లిదండ్రులకున్న ఆశలను అనువుగా గా మార్చుకొని కొంతమంది” ప్రైవేట్ పాఠశాలల “యాజమాన్యం జిల్లా కేంద్రంలో ఉన్న బుక్ స్టాల్ యజమానులతో ఒప్పందం చేసుకుని అధిక ధరలు నిర్ణయిస్తూ, పర్సెంటేజ్ లు పంచుకుంటూ, తల్లిదండ్రుల జేబులకు చిల్లులు పెడుతున్నారు.ఇదిలా ఉండగా! ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యల ఆగడాలకు ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేయాల్సిన జిల్లా విద్యాధికారి పిర్యాదు అందితేనే స్పందిస్తానంటుండటం అనుమానాలకు తావిస్తుంది. ‘సిలబస్’ రాష్ట్రమంతా ఒకే విధంగా ఉంటున్నాప్పటికి, పలు స్కూళ్ల యాజమాన్యం ” మా సిలబస్ మిగతా స్కూళ్ల కంటే ప్రత్యేకంగా ఉంటుంది, అందుకే అదనంగా మరి కొన్ని బుక్స్ అవసరముంటుందని, అందుకే “ఫలానా ” బుక్ స్టాల్ ల్లో మాత్రమే దొరుకుతాయాన్ని ఆయా స్కూల్లు ఒప్పందం కుదుర్చుకున్న బుక్ స్టాల్లకు వెలితే లభిస్తాయని చెప్పి పంపిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు తెలుపుతున్నారు.ఇదిలా ఉండగా! ప్రశ్నిస్తే మా పిల్లలకు సరైన విద్యాబోధన జరుగుతుందో లేదోనని, బహిరంగంగా ఈ విషయాని తెలపడానికి విద్యార్థుల తల్లిదండ్రులు జంకుతున్నారు. దశల వారీగా జిల్లా లోని పాఠశాల లను సందర్శించి, విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకోవాల్సిన జిల్లా విద్యాధికారి ప్రతేక దినాలలో తప్ప మరెప్పుడు ప్రైవేట్ పాఠశాలలను సందర్శించక పోవడం కోసమేరుపు. మరి ఇంత జరుగుతున్న,పాఠ్య పుస్తకాల పేరిట పలు ప్రైవేట్ పాఠశాల ల యాజమాన్యం,విద్యార్థుల తల్లిదండ్రుల ను, చేస్తున్న నిలువు దోపిడీని జిల్లా విద్యాధికారి ఇప్పటికైనా అరికడతారా? లేక విద్యార్ధి సంఘాలు, తల్లిదండ్రులు రోడ్డేక్కి ఉద్యమిచే వరకు వేచి చూస్తారా?చూడాలి.











Leave a Reply